మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ కు మాస్ ట్రీట్ అదించారు శంకర్. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని నటించగా సెకండ్ హీరోయిన్ గా అంజలి నటించారు.

ఇప్పటికే అంచనాలు అందతనం ఎత్తులో ఉండగా.. ఈ ట్రైలర్ రిలీజ్ చో భారీ అంచనాలు పెరిగిపోయాయి గేమ్ ఛేంజర్ పై. ట్రైలర్ దుమ్మురేపిందని చెప్పవచ్చు. ఇక ఈమూవీలో శ్రీకాంత్, సునిల్ తో పాటు జయరామ్, ఎస్ జే సూర్యలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటి అమెరికాలో రకరకాల ఈవెంట్లు చేశారు టీమ్. ఇక ఇప్పుడు పాన్ ఇండియా ప్రమోషన్లను గ్రాండ్ గా చేయబోతున్నారు. సినిమా రిలీజ్ కు వారం పైనే ఉండటంతో.. ఈవారం రోజులు ప్రమోషన్ల హోరుతో అదరగొట్టబోతున్నారు. ఈ సినిమా లో డ్యూయల్ రోల్ చేశారు రామ్ చరణ్. ముఖ్యమంత్రిగా ఎస్ జే సూర్య, రామ్ చరణ్ అసిస్టెంట్ సైడ్ సుందరంగా సునిల్. రామ్ చరణ్ రెండో పాత్ర భార్యగా అంజలి నటించినట్టు తెలుస్తోంది.

ఇక కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు, మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. సెంటిమెంట్, కామెడీతో పాటు ఫ్యాన్స్ ను అలరించే ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ మూవీలో కనిపించబోతున్నట్టు అర్ధం అవుతోంది.

ehatv

ehatv

Next Story