మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆంధ్ర ప్రదేశ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు 1600 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెగా హీరో రామ్ చరణ్ , కియారా అద్వాని కాంబినేషన్లో తెరక్కిన సినిమా గేమ్ ఛేంజర్. సౌత్ ఇండియాన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈమూవీ సంక్రాంతి కానుకగా.. జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో ఈమూవీ ప్రమోషన్స్ ను సూపర్ ఫాస్ట్ గా నిర్వహిస్తున్నారు మూవీ టీమ్. ఇక ఇప్పటికే విదేశాల్లో రకరకాల ఈవెంట్లు చేసుకుని ఇండియాకు వచ్చిన చిత్ర బృందం.. రీసెంట్ గా హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ను నిర్వహించారు. రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈసినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈక్రమంలో ఈసినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ను ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేశారు.
ఇర ఈ ఈవెంట్‌కు గేమ్ ఛేంజర్ హీరో, గ్లోబల్ స్టార్ రాం చరణ్ బాబాయి , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. దాంతో జిల్లా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేయగా, దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు రానున్నారనే అంచనాల నడుమ భారీగా పోలీసులను మోహరించారు. ఈవెంట్‌లో ఎలాంటి సంఘటనలు జరగకుండా 1600 మందితో బందోబస్తును ఏర్పాటు చేశార. 400 మంది పోలీసు అధికారులతో పాటు 1200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తుకు ఏర్పాటు చేశారు.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాతనరక తోలిసారిగా సినిమా ఈవెంట్‌కు వస్తున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ చాలా స్పెషల్ అవ్వబోతోంది. గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో లింక్ అయ్యి ఉండటంతో మెగా అభిమానులు భారీ ఎత్తున వస్తారని అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా తొక్కిసలాగ ఘటనలు జరగకుండా జాత్రత్త పడుతున్నారు. వేదిక వద్దకు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు పోలీసులు. గ్రౌండ్ సమీపంలో 20 వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. వేదిక ముందు బారికేడ్లు, హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు.