రిలీజ్ అయ్యి నెల తిరక్కముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈమూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

రిలీజ్ అయ్యి నెల తిరక్కముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈమూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వాని హీరో హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar)రూపొందించిన ఈసినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయ్యింది. దాదాపు మూడేళ్ళు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలి మెగా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది . పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈసినిమా కలెక్షన్లు పెద్దగా రాబట్టలేకపోయింది.

ఇక ఇక గేమ్ ఛేంజర్ ఓటీటీ(OTT) రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు(Telugu), కన్నడ(Kannada) సహా తమిళ(Tamil) భాషల్లో ఈ ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓటిటిలో వచ్చాక ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. హిందీ, మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ కోసం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ కు ముందే మరోసారి ఎడిటింగ్ చేయించాలని కోరుతున్నారట. మెగా ఫ్యాన్స్. ఈమూవీలో కట్ చేసిన మిగతా భాగాలను కూడా సెట్ చేసి.. రీ ఎడిట్ చేయమని అంటున్నారట.

తమన్ సంగీతం అందించిన ఈసినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మించారు. శంకర్ డైరెక్షన్ తో పాటు స్క్రీన్ ప్లే ఈసినిమాకు బాగా మైనస్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. చరణ్ తో పాటు కియారా అద్వాని(Kiara Advani), అంజలి(Anjali), ఎస్ జే సూర్య(SJ Surya), శ్రీకాంత్(Srikanth), జయరామ్(Jayaram), సునిల్(Sunil), రాజీవ్ కనకాల(Rajiv Kanakala) లాంటి స్టార్స్ సందడి చేసిన ఈమూవీ రిలీజ్ అయి నెలరోజులు కూడా తిరక్క ముందే ఓటీటీలోకి రావడం ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి.

ehatv

ehatv

Next Story