ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటీజం(Nepotism).. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో నెపోటీజం గురించి స్పందించాడు స్టార్ సీనియర్ హీరో.. రీసెంట్ గా గదర్2(Gaddar 2) సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సన్నీ డియోల్(Sunny Deol). ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటీజం(Nepotism).. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో నెపోటీజం గురించి స్పందించాడు స్టార్ సీనియర్ హీరో.. రీసెంట్ గా గదర్2(Gaddar 2) సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సన్నీ డియోల్(Sunny Deol). ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..?
రీసెంట్ గా బాలీవుడ్ తో పాటు.. దేశ వ్యాప్తంగా .. గదర్ 2తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు సీనియర్ హీరో సన్నీ డియోలో. ఒ సునామీలా వీరుచుకుపడింది మూవీ.. ఇక అప్పటి నుంచి ఇంకాస్త యాక్టీవ్ అయ్యారు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol). అప్పుడప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉంటాడు.. అందుల ఏదో ఒకటి కాంట్రవర్సీ అవ్వక మానదు కదా..? ఇక తాజాగా సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఆరోపణలపై స్పందించారు సన్నీ డియోల్.
నెపోటిజం గురించి జనాలు ఎప్పుడూ మాట్లాడుతుంటారని, కానీ అసలు అదేంటని తాను ఆలోచిస్తుంటానని చెప్పుకొచ్చారు. అసలు తండ్రి తన బిడ్డలకు సపోర్ట్ చేయకుంటే ఎవరు చేస్తారని ప్రశ్నించారు.నెపోటిజంపై ఏం మాట్లాడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని, ఇది అన్ని రంగాల్లో ఉందని వ్యాఖ్యానించారు. నటన కావచ్చు మరో కెరీర్ కావచ్చు తండ్రి తన బిడ్లల భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచిస్తాడని అన్నారు. ఏ విషయంలోనూ సక్సెస్ దక్కక నైరాశ్యంలో ఉన్నవారే ఎక్కువగా నెపోటిజం పదాన్ని వాడతారని, ఇందులో వారి తప్పు కూడా లేదని అన్నారు.
అసలు నెపోటిజం అనే పదానికి అర్ధం లేదని పేర్కొన్నారు. తన తండ్రి ధర్మేంద్ర కష్టపడి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారని, తాను, బాబీ, అభయ్ డియోల్‌లు ఎవరికి వారు తమదైన గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు తండ్రిగా ఉండటం అంటే ఏంటో తనకు తెలిసిందని, తన తండ్రి ఎలా ఫీలయ్యారో అర్ధమవుతోందని, తండ్రి భయాలు, ఇబ్బందులు ఏంటో తెలిసివస్తోందని, అయితే తన కుమారుడు రజ్వీర్ తనదైన ప్రయాణాన్ని సాగిస్తున్నాడని చెప్పారు.