గచ్చిబౌలిలోని(Gachibowli) రాడిసన్ హోటల్‌లో(Radisson Hotel) జరిగిన డ్రగ్ రైడింగ్‌లో(Drug raiding) ఓ తెలుగు హీరోయిన్ చెల్లెలు లిషి గణేశ్(Lishi Ganesh) కూడా పట్టుబడింది. గతంలో రాడిసన్ బ్లూ అనే హోటల్‌లో ఉన్న ఫుడింగ్ పబ్ మీద రైడింగ్ జరినప్పుడు కుషిత కళ్లపు(Kushitha kallapu), ఆమె చెల్లెలు లిషి గణేశ్ కళ్లపు అనే అమ్మాయిలిద్దరూ పోలీసులకు చిక్కారు. తాము చీజ్ బజ్జీలు తినడానికి అక్కడికి వెళ్లామని, అంతే తప్ప తమకు డ్రగ్స్ అలవాటే లేదని చెప్పకొచ్చారు.

Lishi Ganesh
గచ్చిబౌలిలోని(Gachibowli) రాడిసన్ హోటల్‌లో(Radisson Hotel) జరిగిన డ్రగ్ రైడింగ్‌లో(Drug raiding) ఓ తెలుగు హీరోయిన్ చెల్లెలు లిషి గణేశ్(Lishi Ganesh) కూడా పట్టుబడింది. గతంలో రాడిసన్ బ్లూ అనే హోటల్‌లో ఉన్న ఫుడింగ్ పబ్ మీద రైడింగ్ జరినప్పుడు కుషిత కళ్లపు(Kushitha kallapu), ఆమె చెల్లెలు లిషి గణేశ్ కళ్లపు అనే అమ్మాయిలిద్దరూ పోలీసులకు చిక్కారు.. తాము చీజ్ బజ్జీలు తినడానికి అక్కడికి వెళ్లామని, అంతే తప్ప తమకు డ్రగ్స్ అలవాటే లేదని చెప్పకొచ్చారు. అప్పట్నుంచి ఆమె చీజ్ బజ్జీల పాపగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యిందన్న విషయం తెలిసిందే. తదనంతరం ఆమెకు సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. ఆమె నటించిన బాబు నంబర్‌వన్ బుల్షిట్ గాయ్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మహేశ్‌బాబు(Mahesh babu) గుంటూరుకారం(Gunturu karam) సినిమాలో కూడా ఆమె నటించింది కానీ ఎడిటింగ్‌లో ఆమె పాత్రను తొలగించారు. ఇప్పుడు ఆమె చెల్లెలు లిషి గణేశ్ మళ్లీ రాడిసన్ గచ్చిబౌలి హోటల్‌లో డ్రగ్స్ రైడ్ జరిగినప్పుడు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో పది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వారిలో లిషి గణేశ్ ఒకరు. ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
