తాజాగా ఈ సినిమాను టార్గెట్ చేసి మరీ నెగటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రముఖ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ బుక్ మై షోలో

ఓ ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నిస్తే తొక్కేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇక టాలీవుడ్ లో కూడా పాపం ఎంతో మంది ట్యాలెంట్ యంగ్ ఆర్టిస్టులను తొక్కేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పనిగట్టుకుని మరీ కొందరు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. గతంలో విజయ్ దేవరకొండ విషయంలో అలాగే జరిగింది. ఇప్పుడు విశ్వక్ సేన్ విషయంలో కూడా అలాంటిదే జరుగుతూ ఉంది. గత వారం విడుదలైన సినిమా 'గామి'.. మిశ్రమ రెస్పాన్స్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ వారాంతంలోనే బ్రేక్‌ఈవెన్ మార్క్‌ని సాధించి ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది. ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. చాలా డిఫరెంట్ గా సాగుతుంది ఈ సినిమా. అలాంటి సినిమా వేరే ఇండస్ట్రీ నుండి వచ్చింటే మాత్రం ఊహించని ప్రశంసలు వచ్చేవి. కానీ తెలుగు వాళ్లు ఇలాంటి సినిమాలు తీస్తే మాత్రం నెగటివ్ ట్రోలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు.

తాజాగా ఈ సినిమాను టార్గెట్ చేసి మరీ నెగటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రముఖ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ బుక్ మై షోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కావాలనే కొందరు 1/10 రేటింగ్‌లను పోస్ట్ చేయడం ద్వారా సినిమా రేటింగ్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. విశ్వక్ సేన్ ప్రకారం కొందరు కావాలనే 1/10 రేటింగ్‌లను ఇస్తూ వస్తున్నారని ఆరోపించాడు. మీరు ఎన్నిసార్లు లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తానని విశ్వక్ సేన్ తేల్చి చెప్పాడు.

గామి సినిమాను ఇంతలా హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. రేటింగ్ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. కొందరు కావాలనే 10కి 1 రేటింగ్‌ ఇస్తున్నారు.. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్ 1కి పడిపోయిందని విశ్వక్ సేన్ తెలిపారు. ఇలాంటి పనులు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలీదన్నారు. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైందని అన్నారు. అయితే ఫేక్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని విశ్వక్ సేన్ హెచ్చరించాడు.

Updated On 12 March 2024 9:27 PM GMT
Yagnik

Yagnik

Next Story