టైటిల్ సహా ఫస్ట్ లుక్ నుంచే ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ అందిస్తున్న ఈ సినిమా తాజా ట్రైలర్ తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా 'గామి'. ఈ సినిమా గురించి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా ఈ సినిమాకు నాంది 6-7 ఏళ్ల క్రితం పడింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మార్చి 8న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ సినిమాకు మంచి పాపులారిటీ ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అయితే ఆ రోజున గామి సినిమాను విడుదల చేయనున్నారు. 'గామి' పోస్టర్లు, గ్లింప్స్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు. అయితే ఈ సినిమాకు మంచి బజ్‌ వస్తోంది.

గామి ట్రైలర్ విడుదలయ్యాక.. బాగా ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్, సంగీతం ఈ ట్రైలర్ లో చూశాం. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడం గ్యారెంటీ అని అంటున్నారు. తెలుగు సినిమా నుంచి మరో గర్వకారణమైన చిత్రం రాబోతుంది. హ్యూమన్ టచ్ డిజార్డర్ ఉన్న వ్యక్తి చేసే ప్రయాణమే ఈ సినిమా. హిమాలయాలలో చేసే సాహసాలను ఈ సినిమాలో చూపించారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? అనేది గామి కథ. విశ్వక్ సేన్ కథతో పాటు సమాంతరంగా మరో రెండు కథలు కూడా సినిమాలో ఉన్నాయి. అఘోరా పాత్రలో విశ్వక్ ఈ మూవీలో కనిపించనున్నాడు. టైటిల్ సహా ఫస్ట్ లుక్ నుంచే ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ అందిస్తున్న ఈ సినిమా తాజా ట్రైలర్ తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. గామి సినిమాకి నరేష్ కుమరన్ మ్యూజిక్ అందించాడు. విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే అందించారు.2017లో గామి సినిమాను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. 2018 లో షూటింగ్ మొద‌లైంది. ఐదేళ్ల పాటు షూటింగ్‌ జ‌రుపుకుంది. గామి సినిమాను వీ సెల్యూలాయిడ్స్ రిలీజ్ చేస్తోంది. గామి సినిమాలో చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Updated On 1 March 2024 1:27 AM GMT
Yagnik

Yagnik

Next Story