ట్రిపులార్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌(Jr. NTR) నటిస్తున్న సినిమా దేవర(Devara ). దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా(Pan India Movie)పై ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ట్రిపులార్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌(Jr. NTR) నటిస్తున్న సినిమా దేవర(Devara ). దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా(Pan India Movie)పై ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి(Chiranjeevi)తో తీసిన ఆచార్య(Acharya) అట్టర్‌ ఫెయిల్‌ అవ్వడంతో దేవరను చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు శివ. మొదట ఒక సినిమాగా ప్రారంభించారు కానీ తర్వాత రెండు భాగాలుగా సినిమాను తీస్తున్నామని మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ జనవరి మొదటి వారంలో వస్తుందని చెబుతున్నారు. అయితే అంతలోపే ఈ సినిమాపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమాను మొదలు పెట్టి చాలా కాలమే అయ్యింది. ఇప్పటి వరకు చాలా రోజుల పాటు షూటింగ్‌ చేశారు. కోట్లకు కోట్లు గుమ్మరించారు. అయినా వచ్చిన ఫుటేజ్‌ తక్కువేనని ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తున్న మాట. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా ఫైటింగ్ సీన్లకే సరిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమాను రెండు భాగాలుగా మార్చారని చెబుతున్నారు. మొదటి భాగంలో విశ్రాంతి దగ్గర ఆపే కథను రెండు భాగాలుగా చేయడం వల్ల తొలి భాగం చివరలో ఆపుతారని చెబుతున్నారు. ప్రస్తుతానికి దేవర సినిమాకు ఫండింగ్‌ అవసరం ఉంది. అందుకే సినమా ఎలా ఉండబోతున్నదో క్లారిటీగా చెప్పడానికే ఓ గ్లింప్స్‌ కట్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌- కొరటాల శివ అంటే చిన్న కాంబినేషనేమీ కాదు. సినిమాను కొరటాల శివ ఫ్రెండ్ నిర్మిస్తున్నాడు. ఇది ఎస్టాబ్లిష్‌ అయిన సంస్థేమీ కాదు. అందుకే నిధుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)
నటిస్తున్నారు. ఈమె కాల్‌షీట్లు కేవలం 30 రోజులకు అటు ఇటుగా తీసుకున్నారని వినికిడి. సినిమాలో నాలుగు పాటలుంటే వాటికే ఈ కాల్‌షీట్లు సరిపోతాయి. ఈ లెక్కన సినిమాలో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Updated On 21 Dec 2023 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story