✕
Where Is Pushpa : పుష్ప ఎక్కడ?... ఏంటా క్వశ్చన్...సమాధానం మామ్మూలుగా ఉండదు.
By EhatvPublished on 19 April 2023 7:22 AM GMT
ఏంటా క్వశ్చన్...సమాధానం మామ్మూలుగా ఉండదు ఆగ్నికి ఆజ్యం తోడైనట్టు....ఐకాన్ స్టార్ అల్లు ఆర్జునే ఓ పెద్ద తుఫాన...దాని వేగాన్ని వెయ్యి రెట్లు పెంచే ఫాన్ సుకుమార్....అదే కదా..

x
pushpa
-
- ఏంటా క్వశ్చన్...సమాధానం మామ్మూలుగా ఉండదు ఆగ్నికి ఆజ్యం తోడైనట్టు....ఐకాన్ స్టార్ అల్లు ఆర్జునే ఓ పెద్ద తుఫాన...దాని వేగాన్ని వెయ్యి రెట్లు పెంచే ఫాన్ సుకుమార్....అదే కదా..ఆరోజున అల్లు అర్జున్ పుష్ఫ ఫంక్షన్లో స్టేజి మీద అందరి ముందు చెప్పింద. ‘’సుకుమార్ లేకపోతే , ఆర్య లేదు. ఆర్య లేకపోతే అల్లు ఆర్జున్ లేడు’’ అని చెబుతుంటే ఆడిటోరియం మొత్తం ఆ రోజున చాలా సెంటిమెంటల్‌గా మువ్ అయిపోయింది. కొన్ని కాంబినేషన్లు అంతే...వాటిని బోర్న్ కాంబినేషన్స్ అంటారు. ఒకరి కోసం ఒకరు యుద్ధం చేయడానికి సిద్ధపడినప్పుడే పుష్ఫ లాటి సినిమాలు పురుడు పోసుకుంటాయి.
-
- లేకపోతే...దానికి ముందే ..అల వైకుంఠపురం సినిమా వచ్చి అల్లు అర్జున్‌ని ఎంతో స్టైలిష్‌గా చూపించి ధియేటర్ల చేత డాన్స్ చేయిస్తే, పుష్పలో ఏ దర్శకుడైనా అంత డీ గ్లామర్ లుక్‌ని కన్సీవ్ చేస్తాడా? కాని సుకుమార్ సాహసం అది. అంతకన్నా పెద్ద సాహసం అల్లు అర్జున్‌ది. ఇద్దరు ఎవరి మట్టుకు వాళ్ళు కాంప్రమైజ్ లేని మొండిఘటాలు. అందుకే పుష్పలాటి ఆన్కాంప్రమైజింగ్ బ్లాక్ బస్టర్స్ వస్తాయి. వచ్చింది. దేశమంతా విడుదలై, అల్లు ఆర్జున్ అంటే గ్లోబ్ అంతా దద్దరిల్లిపోయేట్టు పుష్ప విర్రవీగిపోయింది కలెక్షన్లతో, అన్‌కంట్రోలబుల్ వేవ్‌తో. ఒక్కసారిగా అల్లు ఆర్జున్ రేంజ్ ఎక్కడికో దూసుకుపోయింది. పెరఫార్మర్గా అల్లు అర్జున్‌ది పోలికే లేని రేంజ్. దానికి తోడు అంత భయంకరమైన హిట్ వస్తే...ఇంక ఆ రేంజ్‌కి సింహాసనం వేసినట్టే. పుష్ఫ అన్ని రకాలుగా బాక్సాఫీసును షేక్ చేసి, ఆల్లు అర్జున్‌కి గానీ, దర్శకుడిగా సుకుమార్‌కి గానీ తిరుగులేని ఇమేజ్‌ని ఇచ్చింది.
-
- అందుకే పుష్ప టు అనగానే అందరూ పిచ్చెక్కిపోయారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వెర్రెక్కిపోయారు. మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్, రవి, చెర్రీ అందరూ కూడా అనవసరంగానే కాదు, అవసరంగా కూడా మాట్లాడే అలవాటు లేనివాళ్ళు కావడం చేత పుష్ఫ టు నిశ్శబ్దం జనాల్ని సస్పెన్స్‌తో ఊపరాడనివ్వలేదు. ఎదురుచూపులు బాగా ఉడికెత్తే వరకూ ఆగి అప్పుడు విడుదల చేశారు పుష్ఫ టు గ్లిమ్స్. దెబ్బకి ప్రపంచం దద్దరిల్లిపోయింది. ఆది గ్లిమ్సా....బాంబా...తేల్చుకోలేకపోయారు. అంత ఎటామిక్ ఎనర్జీని క్రియేట్ చేసింది పుష్ఫ టు గ్లిమ్స్. పుష్ఫ ఎక్కడా...అనే ఆ ఆరాలో మిళితమైన ఆ ఉత్కంఠ ఉక్కిరిబిక్కిరి చేసేసింది.
-
- పైగా మొదటి షాట్స్‌లో పుష్ఫ నెత్తుటి మరకలతో బట్టలు కనిపించడం....టీవీల్లో న్యూస్ హల్చల్ చేయడం వంటి బిల్డప్ పేద్ద సెన్సేషన్ అయింది. పెరఫెక్ట్ బ్లెండ్...సుకుమార్ బ్రాండ్...అల్లు ఆర్జున్ ట్రెండ్...మూడూ కల్సి కుమ్మేశాయి. అదబిలో జంతువులు వెనక్కి తగ్గాయంటే పులొస్తోందని లెక్క. పులే వెనక్కి తగ్గిందంటే పుష్ప వస్తున్నాడని లెక్క అనే వాయిస్ ఓవర్‌తో స్క్రీన్ ఫ్రేమ్స్ ఒక్కొక్కటి కట్ అవుతుంటే....పుష్ప గెటప్‌లో అల్లు అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, ఓరగా చూడగానే ఇంత భయంకరమైన పులి కాస్తా..పిల్లిలా వెనక్కి తగ్గడమే అందులో మెరుపు....అల్లు అర్జున్ కళ్ళు కూడా పులి కళ్ళలా ఆ గాఢాంథకారంలో టార్జ్లైట్స్లా లైటింగ్‌ని విరజిమ్మితుంటే....ఆస్సలు ఆ షాట్స్‌కి హేట్సాఫ్...అది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్ట్.
-
- అఫ్కోర్స్...ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలను తలదన్నే సినిమాలు తెలుగులోనే వస్తున్నాయి....దానికి తాజాగా విడుదలైన స్టాంపు పుష్ఫ టు గ్లిమ్స్. తిరుగులేని హీరోయిజం...ఎదురులేని పాప్యులారిటీ. ఏదీ పిసరంత కూడా తగ్గకుండా ఆ గ్లిమ్స్ ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్ళనే కాదు...పుష్ప పార్ట్ వన్‌తో బెంబేలెత్తిపోయిన బాలీవుడ్, ఇరుగుపొరుగు రాష్ర్రాలు, నార్త్ బెల్ట్ మొత్తం దుమారం లేచిపోయింది. పుష్ప టు పూర్తిగా విడుదలైనంతగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. మూడే గంటల చిత్రానికి ధీటుగా ఓ చిత్రం మూడు నిమిషాల నిడివిలో గ్లిమ్స్ నిలబడింది, రాబోతున్న సినిమాని నిలబెట్టిందంటే దర్శకుడు సుకుమార్‌కి, పులినే భయపెట్టాడు అన్న హైట్‌ని సాధించిన అల్లు అర్జున్‌కీ హేట్సాఫ్ చెప్పాలి.
-
- అందుకే వ్యూస్, లైక్స్ దుమ్ము లేచిపోయాయి. 100 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం, 3.3 మిలియన్లకు పైగా లైక్స్ అన్నది లేటెస్ట్ రికార్డ్. అతి తక్కువ కాలంలో మైత్రీ మూవీస్ ఎన్నో అరుదైన రికార్డులను సాధించింది. అందులో మరీ క్రేజీగా చెప్పుకోవాలంటే పుష్ఫ 2 గ్లిమ్స్ గురించే చెప్పాలి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా అల్లు అర్జున్ పుట్టిన రోజును కేరింతలతో జరుపుకున్నారని చెప్పడానికి ఏం సందేహించనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగులో కన్నా కూడా హిందీలోనే వ్యూస్ ఎక్కువగా వచ్చాయంటే ‘’హా’’శ్చర్యం కలుగుతుంది.
-
- కానీ అది సహజమే అని కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ సాధించిన క్రెడిట్ అది.పుష్ఫ ఎక్కడా అన్న ప్రశ్నకి ఒక్కటే సమాధానం..... పుష్ప అందరి గుండెల్లో....అందరి కళ్ళల్లో...అందరి ఇళ్ళల్లో.....అందరి మాటల్లో....అందరి ముచ్చట్లలో....వెరసి ప్రపంమంత.... అంతా కలపి ఆకాశమంత!!!!! Written by నాగేంద్రకుమార్

Ehatv
Next Story