టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. వరుణ్ హైదరాబాద్ హోమ్‌లో జూన్ 9 శుక్రవారం ఓ ప్రైవేట్ వేడుకగా ఈ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో ఇద్దరూ ఒకరికొకరు ఉంగరాలు తొడిగి కొత్త ప్రయాణానికి నాంది పలికారు.

Found my Lav, says Varun Tej after engagement with Lavanya Tripathi
టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ల నిశ్చితార్థం(Engagement) హైద్రాబాద్(Hyderabad)లో ఘనంగా జరిగింది. వరుణ్ హైదరాబాద్ హోమ్‌లో జూన్ 9 శుక్రవారం ఓ ప్రైవేట్ వేడుకగా ఈ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో ఇద్దరూ ఒకరికొకరు ఉంగరాలు తొడిగి కొత్త ప్రయాణానికి నాంది పలికారు. ఈ వేడుకకు ఆయన కజిన్ అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్(Ram Charan), చిరంజీవి(Chiranjeevi) కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ ఆహ్వానం లేదని తెలుస్తోంది. అయితే కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకున్నారని మాత్రం తెలుస్తోంది. ఇరువురు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి. లావణ్య, వరుణ్ కూడా తమ తమ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లలో ఫోటోలను అప్‌డేట్ చేసారు.
ఫోటోలను షేర్ చేస్తూ.. వరుణ్ పౌండ్ పై లవ్(Found My Lav) అని రాయగా.. లావణ్య 'ఫౌండ్ మై ఫర్ ఎవర్(Found My Forever) అని రాసింది. లావణ్య, వరుణ్ 2016 నుండి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరు ఎప్పుడూ ఈ విషయమై బహిరంగంగా మాట్లాడలేదు. వీరి ఎఫైర్‌కు సంబంధించిన వార్తలు తరచూ మీడియాలో వచ్చినా ఎవరూ స్పందించలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇరువురు కలిసి మిస్టర్(Mister), అంతరిక్షం(Anthariksham) సినిమాలలో నటించారు. ఆ సమయంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.
