సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajini Kanth) వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. రజనీ నటించిన జైలర్ సినిమా షూటింగ్ ఆల్‌మోస్టాల్ పూర్తయ్యింది. ఇప్పుడు ఆయన కూతురు ఐశ్వర్య(Aishwarya) నిర్మిస్తున్న లాల్ సలాంలో(LAL SALAM) కీలకపాత్ర పోషిస్తున్నారు రజనీకాంత్.

Kapil Dev In Rajini Kanth Movie
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajini Kanth) వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. రజనీ నటించిన జైలర్ సినిమా షూటింగ్ ఆల్‌మోస్టాల్ పూర్తయ్యింది. ఇప్పుడు ఆయన కూతురు ఐశ్వర్య(Aishwarya) నిర్మిస్తున్న లాల్ సలాంలో(LAL SALAM) కీలకపాత్ర పోషిస్తున్నారు రజనీకాంత్. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal) హీరోగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ మూవీలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపిస్తారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే ఈ సినిమా కోసం భారత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను(KApil Dev) రంగంలోకి దించడం.
కపిల్‌దేవ్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారు. ప్రస్తుతం ముంబయిలో(Mumbai) షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో కపిల్‌దేవ్ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని రజనీకాంత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో కపిల్‌దేవ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ప్రపంచకప్‌ను తొలిసారిగా దేశానికి అందించి, భారత ప్రజలు గర్వపడేలా చేసిన లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్‌జీతో కలిసి పనిచేయడం తనకు గౌరవమ. ఇదెంతో ప్రత్యేకమని రజనీ తెలిపారు.
