Chiranjeevi : ఇప్పటికే ఎప్పటికీ మెగాస్టార్ అంటే చిరంజీవే!
ఆశించిన మేర విజయం సాధించలేదు. అంత మాత్రాన చిరంజీవి స్టామినా తగ్గిందని అనుకోవడానికి లేదు. చిరంజీవి ఇలాంటి ఆటుపోట్లను అనేకం ఎదుర్కొన్నారు. ఉత్థాన పతనాలను అనేకం చవి చూశారు. తొచిరంజీవి రెండో ఇన్నింగ్స్‌లో మెగాహిట్ను ఇప్పటి వరకు అందించలేదు. ఖైదీ 150, వాల్తేరు వీరయ్యలను వదిలేస్తే మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదనే చెప్పాలి. మ్మిదో దశంలో కూడా చిరంజీవి ఇంచుమించు ఇలాంటి పరిస్థితే చవి చూశారు. తొమ్మిదో దశకంలో చిరంజీవి తిరుగులేని హీరో! జగదేక వీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ, కొదమసింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వరుసగా వచ్చాయి. ఇండస్ట్రీని షేక్ చేశాయి. కలెక్షన్లను కుమ్మేశాయి. మధ్యలో సూవర్ట్పురం పోలీసు స్టేషన్ కొంచెం దెబ్బతిన్నా అదేమీ చిరంజీవి ఇమేజ్‌కు నష్టం తీసుకురాలేదు. 1993లో వచ్చిన ముఠామేస్త్రీ సినిమా తర్వాత చిరంజీవి సినీ జీవితం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది. అదే సమయంలో బి.గోపాల్ దర్శకత్వంలో మెకానిక్ అల్లుడు సినిమా వచ్చింది

Chiranjeevi
-
- తెలుగు సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చిన ఘనత కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుంది. నిస్సందేహంగా ఆయనొచ్చాకే తెలుగు సినిమాకు వేగం పెరిగింది. స్వయంకృషితో ఎదిగిన నటుడాయన! ఖైదీ సినిమా కంటే ముందే చిరంజీవి స్టార్ అయ్యారు. సూపర్‌స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్‌బాబు కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ముందడుగు కంటే ఖైదీ సినిమానే ఎక్కువ థియేటర్లలో రిలీజయ్యిందంటే అంతకు ముందే చిరంజీవి తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారనేగా అర్థం! ఇప్పుడున్న యువ హీరోలందరికీ చిరంజీవే(Chiranjeevi) ప్రేరణ. మార్గదర్శకుడు! చిరంజీవిని చూసి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చిరంజీవినే నంబర్‌వన్ హీరో! ఆ మాటకొస్తే మొదటి అయిదు స్థానాలలో చిరంజీవే ఉంటారు. ఇటీవల వచ్చిన భోళా శంకర్(Bhola shnakar) సినిమా ప్రేక్షకులకే కాదు, చిరు ఫ్యాన్స్‌కు కూడా నచ్చలేదు.
-
- ఆశించిన మేర విజయం సాధించలేదు. అంత మాత్రాన చిరంజీవి స్టామినా తగ్గిందని అనుకోవడానికి లేదు. చిరంజీవి ఇలాంటి ఆటుపోట్లను అనేకం ఎదుర్కొన్నారు. ఉత్థాన పతనాలను అనేకం చవి చూశారు. తొచిరంజీవి రెండో ఇన్నింగ్స్‌లో మెగాహిట్ను ఇప్పటి వరకు అందించలేదు. ఖైదీ 150, వాల్తేరు వీరయ్యలను వదిలేస్తే మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదనే చెప్పాలి. మ్మిదో దశంలో కూడా చిరంజీవి ఇంచుమించు ఇలాంటి పరిస్థితే చవి చూశారు. తొమ్మిదో దశకంలో చిరంజీవి తిరుగులేని హీరో! జగదేక వీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ, కొదమసింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వరుసగా వచ్చాయి. ఇండస్ట్రీని షేక్ చేశాయి. కలెక్షన్లను కుమ్మేశాయి. మధ్యలో సూవర్ట్పురం పోలీసు స్టేషన్ కొంచెం దెబ్బతిన్నా అదేమీ చిరంజీవి ఇమేజ్‌కు నష్టం తీసుకురాలేదు. 1993లో వచ్చిన ముఠామేస్త్రీ సినిమా తర్వాత చిరంజీవి సినీ జీవితం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది. అదే సమయంలో బి.గోపాల్ దర్శకత్వంలో మెకానిక్ అల్లుడు సినిమా వచ్చింది.
-
- అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది! దురదృష్టవశాత్తూ ఇదే చివరి చిత్రం కూడా అయ్యింది. చిరంజీవిపై అభిమానంతో ఎఎన్ఆర్ కనీస కథ కూడా వినకుండా ఓకే చెప్పారని అంటారు. ఎఎన్ఆర్, చిరంజీవి కాంబినేషన్ అనేసరికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు రాజ్‌కోటి సంగీతాన్ని అందించారు. ఇందులోని ఝుమ్మని తుమ్మెద వేట సినిమా కోసం అప్పట్లోనే పాతిక లక్షలు ఖర్చు చేశారట! సుమారు 500 మంది డాన్సర్లతో, ఏడు రోజుల పాటు ఈ డ్రమ్డ్యాన్స్ పాటను చిత్రీకరించారు. అయినప్పటికీ సినిమాను ప్రేక్షకులు తిప్పికొట్టారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు తీసిన ముగ్గురు మొనగాల్లు కూడా అంతే! కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి త్రిపాత్రాభినయం చేశారు. రమ్యకృష్ణ, నగ్మా, రోజా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది.
-
- తమిళంలో సూపర్‌హిట్ అయిన వాల్టర్ వెట్రివేల్ సినిమా ఆధారంగా హిందీలో ఖుద్దార్ అనే సినిమా వచ్చింది. అక్కడా హిట్టయ్యింది. చిరంజీవితో తీస్తే తెలుగులో కూడా విజయవంతం అవుతుందన్న ఉద్దేశంతో ఆయనను అప్రోచ్ అయ్యారు. చిరంజీవి ఓకే చెప్పారు. అప్పటికే బాలీవుడ్లో అగ్రతారగా వెలుగొందుతున్న శ్రీదేవిని హీరోయిన్గా ఎంపిక చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో అల్లుడా మజాకా సినిమా వచ్చింది. ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ ఈ సినిమా తీశారు. సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని , సెన్సార్ బోర్డు దీనికి పూర్తిగా నిషేధించాలని అప్పట్లో చాలా మంది డిమాండ్ చేశారు. చిరంజీవి ఫ్యాన్స్ దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పట్టుబట్టి సినిమాను రిలీజ్ అయ్యేలా చేసుకున్నారు. సినిమా ఎలా ఉన్నా విజయాన్ని అందుకుంది.
-
- వరుస ఫ్లాపులతో ఉన్న చిరంజీవికి ఇది పెద్ద ఊరటనిచ్చింది. భారీ వసూళ్లను రాబట్టింది. కానీ తర్వాతి ఏడాది అంటే 1995లో వచ్చిన విజయ బాపినీడు సినిమా బిగ్‌బాస్, రిక్షావోడు భారీ డిజాస్టర్లను చవి చూశాయి. రిక్షావోడుపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగులో మొట్టమొదటి డాల్బీ సిస్టమ్ ఆడియో ఉన్న ఈ సినిమాలో రూప్ తేరా మస్తానా అన్న పాట బాగా పాపులరయ్యింది. తెలుగులో మొదటి ర్యాప్ సాంగ్ ఇదే! ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడ్డారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఆదరించలేదు. అసలు సినిమా పరాజయాన్ని చవి చూస్తుందని చిరంజీవి కూడా ఊహించలేదు. వరుస పరాజయాలకు కారణమేమిటో తెలుసుకోవాలనుకున్నారు చిరంజీవి. ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడం కోసం మొట్టమొదటిసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కనీసం కథ కూడా వినకుండా ఏడాది పాటు ఇంట్లో ఉన్నారు.
-
- సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచి అప్పటి వరకు చిరంజీవి ఖాళీగా ఏనాడు ఉండలేదు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను అవలీలగా చేస్తూ వెళ్లారు. కానీ 1996లో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. 1997లో హిట్లర్ సినిమాతో చిరంజీవి మళ్లీ వచ్చారు. ముత్యాల సుబ్బయ్య దీనికి దర్శకత్వం వహించారు. ఇది చిరంజీవికి పూర్వ వైభవాన్ని తెచ్చింది. చిరంజీవి స్టామినా అంటే ఏమిటో ఇండస్ట్రీకి మరోసారి చూపించిందీ సినిమా. 49 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. కలెక్షన్లు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత సురేశ్ కృష్ణ దర్శకత్వంలో మాస్టర్‌లో నటించారు చిరంజీవి. గీతా ఆర్ట్స్ పతాకంలో వచ్చిన ఈ సినిమాకు ఓ విశిష్టత ఉంది. తెలుగులో మొట్టమొదటి డీటీఎస్ సౌండ్ సినిమా ఇదే! ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది.
-
- ముగ్గురు మొనగాళ్లు వంటి డిజాస్టర్ తర్వాత అంజన ప్రొడక్షన్స్ సంస్థ చిరంజీవితో బావగారు బాగున్నారా సినిమాను నిర్మించింది. ఈ సినిమా 54 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత నుంచి చిరంజీవికి ఎదురులేకుండా పోయింది. ఒకట్రెండు సినిమాలు పోయినంత మాత్రాన చిరంజీవి క్రేజ్‌కు ఎలాంటి నష్టమూ వాటిల్లదు. ఆయన ఎప్పటికీ మెగాస్టారే! తెలుగు ఇండస్ట్రీలో ఆయనే నంబర్‌వన్! ఒక్క హిట్ పడాలే కానీ రికార్డులు బద్దలవ్వడం ఖాయం! ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆయన సినిమాల ఎంపికపై ఓ నిర్ణయం తీసుకుంటారని, మంచి కథా పాత్రలకే ఓకే చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను చిరంజీవి మన్నిస్తారని ఆశిద్దాం.. హప్పీ బర్త్ డే టు చిరంజీవి!
