దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి రూపొందించిన విజయవారి క్లాసిక్ సినిమా జగదేకవీరుని కథ సినిమా గుర్తుందా? తమిళంలో సూపర్‌హిట్టయిన జగతల ప్రతాపన్ ఆధారంగా తీసిన సినిమా ఇది! ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఇందులో ఎన్.టి.రామారావు ఇంద్రుడి కూతురు జయంతిని, అగ్నిదేవుడి కూతురు మరీచిని, వరుణదేవుడి కూతురు వారుణిని,

Chiranjeevi New Movie
దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి రూపొందించిన విజయవారి క్లాసిక్ సినిమా జగదేకవీరుని కథ సినిమా గుర్తుందా? తమిళంలో సూపర్‌హిట్టయిన జగతల ప్రతాపన్ ఆధారంగా తీసిన సినిమా ఇది! ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఇందులో ఎన్.టి.రామారావు ఇంద్రుడి కూతురు జయంతిని, అగ్నిదేవుడి కూతురు మరీచిని, వరుణదేవుడి కూతురు వారుణిని, నాగదేవుడి కూతురు నాగినిని వివాహం చేసుకుంటాడు. జయంతి పాత్రను బి.సరోజాదేవి, మరీచి పాత్రను బాలా, వారుణి పాత్రను జయంతి, నాగిని పాత్రను ఎల్.విజయలక్ష్మి పోషించారు.ఇప్పుడీ విషయం ఎందుకంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇంచుమించు ఇలాంటి కథతోనే ప్రేక్షకులను అలరించబోతున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ దేవ, దానవ, పాతాళ, యక్ష, భూలోకాలన్నీ చుట్టేస్తారట. ఈ లోకాలన్నింటిని ఎందుకు తిరిగి వస్తారంటే ఓ పాప కోసం అని చెబుతున్నారు.
ఎలాగూ లోకాలన్నీ తిరుగుతున్నారు కాబట్టి, లోకానికొక హీరోయిన్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ అనుకుంటున్నారు. సో మొత్తం అయిదు లోకాలకు గాను, అయిదుగురు హీరోయిన్లను ఖరారు చేసేపనిలో ఉన్నాడు. మొన్నటివరకూ అనుష్క, మృణాళ్ ఠాకూర్ పేర్లు మాత్రమే వినిపించాయి. ఇక ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పేరు కూడా బలంగానే వినిపిస్తున్నది. మరో ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయాల్సివుంది. మరి ఈ అయిదుగురిలో అసలు నాయిక ఎవరనేది ఇప్పటికైతే సస్పెన్సే! యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
