బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌(Amir Khan)- నిర్మాత రీనా దత్తాల(Rina Dutta) కూతురు ఐరా ఖాన్‌(Ira Khan) పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. తన ప్రియుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను(Nupur Shikhare) ఆమె పెళ్లి చేసుకుంది. బుధవారం ముంబాయిలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో నుపుర్‌శిఖరే- రీనా దత్తాలు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. బుధవారం రోజే గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌(Amir Khan)- నిర్మాత రీనా దత్తాల(Rina Dutta) కూతురు ఐరా ఖాన్‌(Ira Khan) పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. తన ప్రియుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను(Nupur Shikhare) ఆమె పెళ్లి చేసుకుంది. బుధవారం ముంబాయిలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో నుపుర్‌శిఖరే- రీనా దత్తాలు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. బుధవారం రోజే గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు. నుపుర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావడంతో పెళ్లి జరిగే చోటుకు జాగింగ్‌(Jogging) చేసుకుంటూ వచ్చాడు. సుమారు ఎనిమిది కిలోమీటర్లు అలా పరుగెత్తుకుంటూ వచ్చిన నుపుర్‌ దుస్తులు కూడా మార్చుకోకుండా టీషర్ట్‌పైనే(Wast) పెళ్లి చేసుకున్నాడు. రిసెప్షన్‌కు మాత్రం సూటు బూటు వేసుకున్నాడు. ఈ పెళ్లిలో ఆమిర్‌ఖాన్‌ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేయడం విశేషం. రెండో మాజీ భార్య కిరణ్‌రావుకు(Kiran Rao) ఆమిర్‌ ఆప్యాయంగా నుదుటన ముద్దు కూడా పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో(Social media) వైరల్‌ అవుతున్నాయి. ఇకపోతే సెలబ్రిటీలు, సన్నిహితుల కోసం ఈ నెల 13వ తేదీన ముంబాయిలో విందును ఏర్పాటు చేశారు. ఆమిర్‌ఖాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేసిన నుపుర్‌ శిఖరేకు ఐరాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం చెప్పాయి. 2022 నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. ఇన్నాళ్లకు పెళ్లి చేసుకున్నారు. ఆమిర్‌ఖాన్‌ మొదటి భార్య రీనా దత్తాల కూతురే ఐరా ఖాన్‌. వీరికి జునైద్‌ ఖాన్‌ అనే కొడుకు కూడా ఉన్నాడు. రీనా దత్తాకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమిర్‌ 2005లో కిరణ్‌రావును పెళ్లి చేసుకన్నాడు. 2022లో వీరిద్దరు విడాకులు పుచ్చుకున్నారు.

Updated On 4 Jan 2024 2:43 AM GMT
Ehatv

Ehatv

Next Story