RRR సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ప్రపంచం గుర్తించింది. ఈ మూవీతో జపాన్ లోనూ చరణ్ కు అభిమానుల తాకిడి పెరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరినోట చెర్రీ పేరే వినిపిస్తోంది. చరణ్ కు వరల్డ్ ఫేమస్ షో అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమానికి ఆహ్వానం అందించింది. ఆ కార్యక్రమానికి అటెండ్ అయి RRR సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ వరకు అన్నీ షేర్ చేసుకున్నాడు. ఆ షో హోస్టుల్లో […]
RRR సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ప్రపంచం గుర్తించింది. ఈ మూవీతో జపాన్ లోనూ చరణ్ కు అభిమానుల తాకిడి పెరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరినోట చెర్రీ పేరే వినిపిస్తోంది. చరణ్ కు వరల్డ్ ఫేమస్ షో అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమానికి ఆహ్వానం అందించింది. ఆ కార్యక్రమానికి అటెండ్ అయి RRR సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ వరకు అన్నీ షేర్ చేసుకున్నాడు.
ఆ షో హోస్టుల్లో ఒకరైన జెన్నిఫర్ ఆస్టన్.. చరణ్ ను మీరు తండ్రి అవుతున్నాననే భయం మీలో ఏమైనా ఉందా అని అడిగింది. సమాధానంగా చెర్నీ వెంటనే పిల్లలను ప్లాన్ చేయడానికి ముందు తన భార్య ఉపాసనతో సమయం గడిపేవాడినని చెప్పాడు, కానీ ఇప్పుడు తండ్రి అవుతున్నానని తెలిశాక వరుస షెడ్యూల్స్ తో టైమ్ ఉండటం లేదన్నారు. దాంతోపాటు భార్య ఉపాసన కూడా యూఎస్ రానుందన్నాడు చరణ్.
జెన్నిఫర్ ఆస్టన్ గైనకాలజిస్టు కావడంతో మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉందన్నాడు. మరోవైపు మీ నెంబర్ తీసుకుంటానని.. తన భార్యతో సహా వచ్చి కలుస్తాను అని హింట్ ఇచ్చాడు. చెర్నీ మాటలకు ఆమె నవ్వుతూ నీ భార్యకు కాన్పు చేయడం తనకు ఆనందమే అని బదులిచ్చింది ఆమె. అయితే తాను తండ్రి అవుతున్నానన్న సంగతి మొదటిగా మిత్రుడు తారక్ తోనే పంచుకున్నట్టు తెలిపాడు.
ఇప్పటికే ‘నాటు నాటు’ సాంగ్ కు గాను ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు అందుకుంది RRR చిత్ర యూనిట్. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్ లో జరిగిన మరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్ కేటరీలో ‘క్రిటిక్స్ ఛాయిస్’ అవార్డు సొంతం చేసుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోకు అతిథిగా వెళ్లడం ఖచ్చితంగా టాలీవుడ్ రేంజ్ ని పెంచే పరిణామాలుగానే భావించవచ్చు అనే టాక్స్ వినిపిస్తున్నాయి.