డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు. ప్రాజెక్‌ కే(Project k) లో ఆయన కల్కిగా(Kalki) నటిస్తున్నారు. ఇందులో కమలహాసన్‌(Kamal hassan), అమితాబ్‌బచ్చన్‌(Amithabh bachchan), దీపికా పడుకొనే(deepika Padukone), దిశా పటానీ(disha Patani) వంటి ప్రముఖ తారాగణం కనిపించబతున్నారు. నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు కల్కి 2898(Kalki 2898) ఏడీ టైటిల్‌ను ఖరారు చేశారు.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు. ప్రాజెక్‌ కే(Project k) లో ఆయన కల్కిగా(Kalki) నటిస్తున్నారు. ఇందులో కమలహాసన్‌(Kamal hassan), అమితాబ్‌బచ్చన్‌(Amithabh bachchan), దీపికా పడుకొనే(deepika Padukone), దిశా పటానీ(disha Patani) వంటి ప్రముఖ తారాగణం కనిపించబతున్నారు. నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ(Kalki 2898 Ad) టైటిల్‌ను ఖరారు చేశారు. అమెరికాలో జరుగుతున్న శాన్‌ డియాగో(San deigo) కామిక్‌కాన్‌-2023(Comic can -2023) వేడుకలో ఈ సినిమా టైటిల్‌ను ఖాయం చేయడంతో పాటు గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ప్రపంచం మొత్తం అంధకారం కమ్మేసినప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది.

చీకటిని, అందుకు కారణమైన రాక్షసులను పారదోలి కొత్త వెలుగులను తీసుకొస్తుంది. అప్పుడు అంతం ఆరంభం అవుతుంది అని వీడియోలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారతీయ చిత్రంగా ప్రాచుర్యం పొందిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. శాన్‌ డియాగో కామిక్‌ వేడుకలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ కల్కి 2898 ఏడీలో పెద్ద విజన్‌ ఉందని, ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో నాగ్‌ అశ్విన్‌ తన క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసిన తీరు బాగా నచ్చిందన్నారు కమలహాసన్‌. సినిమాలో స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌ ఉన్నాయన్నారు హీరో ప్రభాస్‌. ' ఈ సినిమా నాకు ఒక అద్భుతమైన అనుభవం. దీని వెనుక గొప్ప పరిశోధన ఉంది' అని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. 'నేను సైన్స్‌ ఫిక్షన్, పురాణాలను ఇష్టపడతాను.

మహాభారతం, స్టార్‌ వార్స్‌... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది’’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పారు ఈ సినిమా తమకో గర్వకారణమని నిర్మాత అశ్వనీదత్‌ అన్నారు. ఈ వేడుకలో రానా, ప్రియాంకా దత్, స్వప్నా దత్‌ పాల్గొన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ను 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాను రామ్‌చరణతో కలిసి నటిస్తానని ప్రభాస్‌ కామిక్‌కాన్‌-2023 వేడుకలో చెప్పారు. ఈ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ‘‘భారతదేశంలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళిగారు ఒకరు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని పాటకు ఆస్కార్‌ రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది దేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. అలాగే రామ్‌చరణ్‌ నాకు మంచి మిత్రుడు. ఏదో ఒక రోజు మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం’’ అని ప్రభాస్‌ అన్నారు.

Updated On 22 July 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story