కోలీవుడ్‌లో(kollywood) ప్రస్తుతం అందరి దృష్టి వచ్చేవారం విడుదల కాబోతున్న మామన్నన్‌(Mamannan) సినిమాపైనే ఉంది. నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌(Udayanidhi Stalin) హీరోగా నటించిన ఆ సినిమాను రెడ్‌ జెయింట్‌ మూవీస్‌(Red Joint Movies) పతాకంపై నిర్మించారు. మారి సెల్వరాజ్‌(Selvaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది

కోలీవుడ్‌లో(kollywood) ప్రస్తుతం అందరి దృష్టి వచ్చేవారం విడుదల కాబోతున్న మామన్నన్‌(Mamannan) సినిమాపైనే ఉంది. నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌(Udayanidhi Stalin) హీరోగా నటించిన ఆ సినిమాను రెడ్‌ జెయింట్‌ మూవీస్‌(Red Joint Movies) పతాకంపై నిర్మించారు. మారి సెల్వరాజ్‌(Selvaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాలంటూ మద్రాస్‌ హైకోర్టులో(Madras High Court) పిటిషన్‌ దాఖలైంది.

ఏంజిల్‌ చిత్ర నిర్మాత రామశరవణన్‌(Ramasaravanan) ఈ పిటిషన్‌ వేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో తాను ఉదయనిధి స్టాలిన్‌, ఆనంది, పాయల్‌ రాజ్‌పుత్‌(Payal Rajputh) హీరో హీరోయిన్లుగా ఏంజెల్‌(angel) అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానని తెలిపారు. కె.ఎస్‌.అదయమాన్‌(K. S. Adayaman) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ 80 శాతం పూర్తి అయ్యిందని, మరో 20 శాతం చేయాల్సి ఉంటుందని రామశరవణన్‌ తెలిపారు. ఉదయనిధి స్టాలిన్‌ తన సినిమాను పక్కన పెట్టి మామన్నన్‌ సినిమా పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు.

అంతే కాకుండా మామన్నన్‌ సినిమా తనకు చివరి చిత్రమవుతుందని ప్రకటించారన్నారు. తాను ఏంజెల్‌ చిత్రం కోసం ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టానని తెలిపారు. తాను చిత్రం పూర్తి కాకపోతే చాలా నష్టపోతానన్నారు. కాబట్టి మామన్నన్‌ చిత్రం విడుదల కాకుండా చూడాలని, తన చిత్రాన్ని పూర్తి చేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించాలని రామశరవణన్‌ పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌ న్యాయమూర్తి కుమరవేల్‌ బాబు సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో ఈ కేసుపై విచారణ కోరుతూ ఉదయనిధి స్టాలిన్‌కు, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థకు నోటీసులు జారీ చేశారు. విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. మామన్నన్‌ సినిమాలో వడివేలు ప్రముఖ పాత్రను పోషించారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌ యూ ట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరిచిన పాటలు పాపులరయ్యాయి.

Updated On 24 Jun 2023 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story