✕
Nayanthara Birthday : హప్పీ బర్త్‌డే నయన్...
By EhatvPublished on 18 Nov 2023 4:32 AM GMT
సినిమా పరిశ్రమలో హీరోలు ఎక్కువకాలం మనుగడ సాగించగలరేమో కానీ హీరోయిన్లు మాత్రం నాలుగైదేళ్లకే ఫేడ్ అవుటవుతారు. కొన్నాళ్ల విరామం తర్వాత ఏ అక్కగానో, వదినగానో, అమ్మగానో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారు. కొందరికి మాత్రమే లాంగ్ ఇన్నింగ్స్ సాధ్యం! రెండు దశాబ్దాలుగా కథానాయికగా కొనసాగడమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన నటీమణులలో నయనతార(Nayanthara) ఒకరు.

x
Nayanthara Birthday
-
- సినిమా పరిశ్రమలో హీరోలు ఎక్కువకాలం మనుగడ సాగించగలరేమో కానీ హీరోయిన్లు మాత్రం నాలుగైదేళ్లకే ఫేడ్ అవుటవుతారు. కొన్నాళ్ల విరామం తర్వాత ఏ అక్కగానో, వదినగానో, అమ్మగానో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారు. కొందరికి మాత్రమే లాంగ్ ఇన్నింగ్స్ సాధ్యం! రెండు దశాబ్దాలుగా కథానాయికగా కొనసాగడమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన నటీమణులలో నయనతార(Nayanthara) ఒకరు.
-
- ఇవాళ ఆమె పుట్టినరోజు. 39వ బర్త్‌డేను జరుపుకుంటున్న నయన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తవుతుందిఇన్నాళ్ల పాటు కథానాయికగా నిలబడగలిగారంటే ఆమె ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలరు కాబట్టి. సీనియర్ హీరోలతో కలిసి నటించగలరు. కుర్ర హీరోలతో జోడి కట్టనూగలరు. సినిమా ఎలాంటిదైనా నయనతార పాత్రకు మాత్రం ప్రాధాన్యం ఉండి తీరుతుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పిన నయనతార తర్వాత తన పంథా మార్చుకున్నారు.
-
- ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే పాత్రలనే ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 80 సినిమాలకు పైగా నటించిన నయనతార అందులో ముప్పాతిక వంతు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే కావడం గమనార్హం.నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. బెంగళూరులో జన్మించిన నయనతార స్వస్థలం కేరళ. ఆమె తల్లిదండ్రులు కురియన కొడియట్టు, ఒమన్ కురియన్.
-
- తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేశారు. ఉద్యోగ నిమిత్తం ఆయన పలు ప్రాంతాలలో పని చేశారు. అందుకే నయనతార విద్యాభ్యాసం కూడా గుజరాత్, ఢిల్లీలలో కూడా సాగింది. ఇంగ్లీషు లిటరేచర్‌లో డిగ్రీ చేసిన నయన్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ చేశారు. టీవీ యాంకర్‌గా కూడా పని చేశారు. 2003లో మలయాళంలో వచ్చిన మనస్సినక్కరే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సత్యన్ అంతిక్కాడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయరామ్ హీరోగా నటించారు.
-
- ఆ మరుసటి ఏడాది షాజీ కైలాస్ డైరెక్షన్లో నాట్టురాజావు, పాజిల్ దర్శకత్వం వహించిన సైకాలాజికల్ థ్రిల్లర్ విస్మయతుంబత్తులో ప్రధాన పాత్రలు పోషించారు. వాటిల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. తర్వాత తమిళ సినిమాల్లో అడుగుపెట్టారు. చంద్రముఖి ఆమెకు మంచి పేరు తెచ్చింది. అటు పిమ్మట తెలుగులోకి వచ్చారు.
-
- లక్ష్మీ సినిమా తర్వాత బాస్, యోగి, దుబాయ్ శ్రీను, తులసి మొదలైన సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. ఎన్టీఆర్(NTR) హీరోగా వచ్చిన అదుర్స్(adhurs) ఆమె కెరీర్‌ను మార్చేసింది.ఇటీవల షారుక్‌ఖాన్‌తో(shah rukh Khan) కలిసి జవాన్(Jawan) సినిమాలో నటించారు. అలా బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు.మొదట్లో నటుడు శింబుతో ప్రేమాయణాన్ని నడిపారు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ విడిపోయారు.
-
- ఇక శింబుతో(Shimbu) కలిసి నటించేది లేదని స్పష్టం చేశారు నయన్. ఆ తర్వాత ప్రభుదేవను(Prabhudeva) ప్రేమించారు. ఈ ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. 2010లో తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రభుదేవా ప్రకటించారు కూడా. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టారు నయన్.అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని తెలిపారు నయనతార. తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయనతారే చెప్పుకున్నారు.
-
- కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు నయన్. సినిమాలు ఆమెను తిరిగి బలంగా నిలబెట్టాయి. ఆమెలో ధైర్యాన్ని నింపాయి. అలా ప్రేమ గాయాలను తట్టుకుని కొంత కాలం తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను(Vignesh Shivan) ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు నయన్. ఈ దంపతులకు కవల(Twins) పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరు సరోగసీ ద్వారా జన్మించారు.ప్రస్తుతం అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్నారు నయన్.
-
- ఒక్కో సినిమాకు పది నుంచి 14 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. వ్యాపారరంగంలో కూడా నయన్ కాలుపెట్టారు. 2018లో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్‌లో చోటు సంపాదించారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి నటి నయనతారే! ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి చర్మ సౌందర్య ఉత్పత్తుల కొత్త వెంచర్‌ను ప్రారంభించారు.
-
- వారి వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 2011లో హిందూ మతాన్ని స్వీకరించారు నయన్. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ (పెబెల్స్) సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది. బాపు రూపొందించిన శ్రీరామరాజ్యంలో సీతగా అద్భుతంగా నటించారు నయన్. ఆ సినిమాకుగాను ఆమెకు నంది అవార్డు కూడా లభించింది. అదే సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది.

Ehatv
Next Story