డ్యాకుమెంటరీలా సినిమాను చుట్టేసి చూడమంటే ఎవరూ చూడటం లేదు. ప్రేక్షకుల అభిరుచి మారింది. పుల్వామా అటాక్(Pulwama attack), తదనంతరం సర్జికల్ స్ట్రయిక్‌లను బేస్ చేసుకుని అల్లుకున్న కథను ఫైటర్‌గా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఈడ్చి తన్నారు. హృతిక్ రోషన్(Hrithik Roshan), అనిల్‌కపూర్(Anil kapoor), దీపిక పడుకొనే(Deepika Padukone) వంటి అగ్రశ్రేణి తారలు ఉన్నా సినిమా మాత్రం తుస్సుమంది.
డ్యాకుమెంటరీలా సినిమాను చుట్టేసి చూడమంటే ఎవరూ చూడటం లేదు. ప్రేక్షకుల అభిరుచి మారింది. పుల్వామా అటాక్(Pulwama attack), తదనంతరం సర్జికల్ స్ట్రయిక్‌లను బేస్ చేసుకుని అల్లుకున్న కథను ఫైటర్‌గా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఈడ్చి తన్నారు. హృతిక్ రోషన్(Hrithik Roshan), అనిల్‌కపూర్(Anil kapoor), దీపిక పడుకొనే(Deepika Padukone) వంటి అగ్రశ్రేణి తారలు ఉన్నా సినిమా మాత్రం తుస్సుమంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకు ఇండియాలో 126 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. గమనించదగ్గ విషయమేమింటే ఈ వసూళ్లు సినిమాలో నటించిన ముగ్గురు కీలక పాత్రధారుల పారితోషికాలతో సమానం కావడం. ఫైటర్ సినిమా(Fighter Movie)కు హృతిక్ రోషన్ 85 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట! దీపిక పడుకొనేకు పారితోషికం కింద 20 కోట్ల రూపాయలు ఇచ్చారట! కీలక పాత్ర పోషించిన అనిల్ కపూర్ 15 కోట్ల రూపాయలు తీసుకున్నాడట! వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్‌ల మొత్తం ఎంతో తాజాగా వచ్చిన వసూళ్ల కూడా అంతే! నెటిజన్లు ఇది చెప్పే సినిమాను ఓ ఆట ఆడుకుంటున్నారు. రిపబ్లిక్ డే సీజన్‌లో వచ్చిన ఈ సినిమా కనీసం 200 కోట్ల రూపాయల నెట్ సాధిస్తుందని అనుకున్నారు. ఇప్పుడేమో 150 కోట్ల రూపాయలు కూడా వచ్చేలా లేవు. మిడిల్ ఈస్ట్ లో సినిమాను నిషేధించిన సంగతి తెలిసిందే!