ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌ సిరీస్‌ను(Fast and Furious) సినీ ప్రేమికులు తెగ ఇష్టపడతారు. అందులో నటించిన విన్‌ డీజిల్‌కు(Vin Diesel) ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయనంటే పడిచచ్చేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆయనపై పడిన కేసును చూసి ఔరా అని అనుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఆయనపై లైంగిక ఆరోపణల(Sexual allegations) కేసు నమోదయ్యింది. విన్‌ డీజిల్‌ దగ్గర ఇంతకు ముందు వ్యక్తిగత సహాయకురాలిగా(Personal Assistant) పని చేసిన జోనాసన్‌పై(Jonason) ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట! 2010లో ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌ చిత్రానికి సీక్వెల్‌ షూటింగ్‌ సమయంలో విన్‌ డీజిల్‌ తనపై లైంగిక దాడి చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌ సిరీస్‌ను(Fast and Furious) సినీ ప్రేమికులు తెగ ఇష్టపడతారు. అందులో నటించిన విన్‌ డీజిల్‌కు(Vin Diesel) ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయనంటే పడిచచ్చేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆయనపై పడిన కేసును చూసి ఔరా అని అనుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఆయనపై లైంగిక ఆరోపణల(Sexual allegations) కేసు నమోదయ్యింది. విన్‌ డీజిల్‌ దగ్గర ఇంతకు ముందు వ్యక్తిగత సహాయకురాలిగా(Personal Assistant) పని చేసిన జోనాసన్‌పై(Jonason) ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట! 2010లో ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌ చిత్రానికి సీక్వెల్‌ షూటింగ్‌ సమయంలో విన్‌ డీజిల్‌ తనపై లైంగిక దాడి చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. పదేళ్ల కిందట అట్లాంటా హోటల్‌(Atlanta Hotel) గదిలో తన సహాయకురాలిగా ఉన్న జోనాసన్‌పై విన్‌ డీజిల్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కాలిఫోర్నియా కోర్టులో(California Court) వ్యాజ్యం దాఖలయ్యింది. ఆమె కోర్టుకు ఏం చెప్పుకున్నారంటే ' ఫాస్ట్ ఫైవ్ చిత్రీకరణ కోసం యూనిట్‌ మొత్తం అట్లాంటాకు వెళ్లాము. అక్కడ షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత అందరం గదులకు చేరుకున్నాం. మరుసటి రోజు షూటింగ్‌ కోసం ‌ కావాల్సిన ఏర్పాట్లను విన్‌ డీజిల్‌కు నేను చేశాను. తెల్లవారుజామున హోటల్ నుంచి బయలుదేరడానికి డీజిల్‌కు సహాయం చేసే బాధ్యతను నాకు ఇచ్చారు. నేను అయన గదిలోకి వెళ్లిన సమయంలో మేమిద్దరమే ఉన్నాం. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న విన్ డీజిల్ నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నన్ను బలవంతంగా పట్టుకుని నా శరీరంపై అసభ్యంగా ప్రవర్తించాడు. వద్దని వారించినా పదేపదే తాకుతూ నా దుస్తులు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. నేను ఆ సమయంలో భయంతో బాత్‌రూమ్‌లోకి పారిపోయాను. అక్కడ నన్ను గోడకు అదిమిపెట్టి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మర్నాడు ఈ ఘోరాన్ని విన్ డీజిల్ సోదరి సమంత విన్సెంట్‌కు(Samantha Vincent) చెప్పాను. కానీ ఆమె చాలా తేలిగ్గా తీసుకుంది. పైగా నన్ను ఉద్యోగం నుంచి తీసేసింది. ఈ విషయంలో నేను ఆమెతో చాలా సేపు గొడవపడ్డాను. రేపిస్ట్‌ విన్‌ డీజిల్‌ను ఆమె రక్షించే ప్రయత్నం చేసింది' అని వివరించింది. 'విన్‌ డీజిల్, సమంత విన్సెంట్‌ వల్ల నా కెరీర్‌ మొత్తం నాశనం అయ్యింది. నా జీవితంలో జరిగిన నష్టాన్ని అతడే భరించాలని కోరింది. అయితే జోనాసన్‌ వేసిన వ్యాజ్యంపై విన్‌ డీజిల్ ప్రతినిధులు ఇంకా రియాక్ట్‌ కాలేదు. 2017లో వచ్చిన త్రిబుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌ అనే సినిమాలో విన్‌ డీజిల్‌ సరసన బాలీవుడ్‌ స్టార్‌ దీపిక పదుకొణె(Deepika Padukone) నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే విన్‌ డీజిల్‌కు ఇండియాలో ఫ్యాన్స్‌ పెరిగారు.

Updated On 22 Dec 2023 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story