బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కు చిత్రమైన పరిస్థితి వచ్చింది. ఆయన్ను ఓ నెటిజన్ చిత్రమైన ప్రశ్న అడిగాడు. నెటిజన్ అడిగిన షాకింగ్ క్వశ్చన్ కు అజయ్ ఏమని సమాధానం చెప్పాడంటే.
బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలలో అజయ్ దేవగన్ ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్ పెరుగుతున్నా.. స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నారు అజయ్.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కు చిత్రమైన పరిస్థితి వచ్చింది. ఆయన్ను ఓ నెటిజన్ చిత్రమైన ప్రశ్న అడిగాడు. నెటిజన్ అడిగిన షాకింగ్ క్వశ్చన్ కు అజయ్ ఏమని సమాధానం చెప్పాడంటే.

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలలో అజయ్ దేవగన్ ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్ పెరుగుతున్నా.. స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నారు అజయ్. సక్సెస్ ఫెయిల్యూర్ సబంధం లేకుండా బాలీవుడ్ లో వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు స్టార్ హీరో. నార్త్ లో మంచి ఇమేజ్ ఉన్న అజయ్ సౌత్ లో అందులోను తెలుగలో చేసిన మొదటి సినిమా ఆర్ఆర్ఆర్.

సౌత్ సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు అజయ్. ఇక్కడి కథలను తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో భోళా సినిమాతో ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అయ్యాడు అజయ్ దేవగణ్. ఇక ఈసినిమా ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి రెడీ అంవుతుంది. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లకు పదును పెట్టారు టీమ్. ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్.

తమిళంలో కార్తీ నటించిన ఖైదీ సినిమాకు హిందీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్లు స్పీడ్ పెంచింది. అయితే బయట ఇంటర్వ్యూలతో పాటు అజయ్ దేవగణ్ కూడా సోషల్ మీడియాలో సొంత ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో ఆస్క్ భోళా అంటూ అభిమానులతో లైవ్ నిర్వహించాడు స్టార్ హీర్. ఇక ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సోషల్ మీడియలో సమాధానం చెప్పారు అజయ్ దేవగణ్. ఈసందర్భంగా ఓ చిత్రమైన ప్రశ్న అతనికి ఎదురయ్యింది.

ఓ అభిమాని అజయ్ దేవగణ్ ను అసక్తికర ప్రశ్న అడిగాడు. మీరు అన్ని సినిమాలు టబుతోనే చేస్తున్నారు. దీనికి ఏదైనా కారణం ఉందా? అని ట్వీట్ చేశాడు. దీనికి కాస్త షాక్ అయిన అజయ్.. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. ఎందుకంటే.. ఆమె డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఈ ట్వీట్లకు సబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ప్రశ్నతో పాటు..మరో ప్రశ్నకు కూడా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు అజయ్. వీటితో పాటు భోళా సినిమా ఎంత రాబడుతుందని మీరు అనుకుంటున్నారు అని ఓ నెటిజన్ అడగ్గా.. ఎంత డబ్బు కలెక్ట్ చేస్తుందో తెలియదు కానీ.. మీ ప్రేమను పొందుతుందని మాత్రం ఆశిస్తున్నా అని అజయ్ బదులిచ్చి.. నెటిజన్ల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. దృశ్యం, దృశ్యం 2, గోల్ మాల్ అగైన్, దేదే ప్యార్ దే, విజయ్ పథ్, హఖీఖత్, తక్షక్ తదితర సినిమాల్లో అజయ్ దేవగణ్, టబు కలిసి నటించారు.

Updated On 17 March 2023 7:15 AM GMT
Ehatv

Ehatv

Next Story