డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ప్రాజెక్ట్‌ కే(Project K) పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైజయంతి మూవీస్‌(Vyjayanthi Movies) బ్యానర్‌పై అశ్వని దత్‌(Aswani dutt) నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్‌(Nag Aswin) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దీపికా పడుకోనె(deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ప్రాజెక్ట్‌ కే(Project K) పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైజయంతి మూవీస్‌(Vyjayanthi Movies) బ్యానర్‌పై అశ్వని దత్‌(Aswani dutt) నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్‌(Nag Aswin) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దీపికా పడుకోనె(deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan), లోక నాయకుడు కమలహాసన్‌లు(Kamal Hassan) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిశా పటానీ(Disha Patani) కీలక పాత్రలో కనిపిస్తారు. జులై 20న ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’(San Diego Comic-Con 2023) వేడుకలో 'ప్రాజెక్ట్‌ కే' టైటిల్‌ను రివీల్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ప్రాజెక్ట్‌ కే' అంటే ఏమిటి? అంటూ మేకర్స్‌ ప్రకటన జారీ చేశారు.

అందులో భాగంగా ఫ్రీగా టీ షర్ట్స్(T-shirts) ఇస్తున్నామంటూ ప్రచారం చేశారు. టీ షర్ట్స్‌ కోసం వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో లింక్‌ను కూడా ఉంచారు. కానీ ఈ విషయంపై అశ్వీనీదత్‌ వైజయంతి మూవీస్‌ చేస్తుంది పెద్ద చీటింగ్ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

అందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు. టీ షర్ట్స్‌ అందుబాటులో ఉంచుతున్నామని ఇప్పటికే మూడు సార్లు లింక్‌ ఓపెన్‌ చేసినా ఎలాంటి ఉపయోగం లేదని వారు తెలుపుతున్నారు. జులై 10న కూడా సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్‌ ఓపెన్‌ చేశారు. సెకన్ల వ్యవధిలోనే లింక్‌ ఓపెన్‌ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపించిందని, . జస్ట్‌ 4 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయిందని ప్రకటించారని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. లింకే ఓపెన్‌ కాలేదు, స్టాక్ అయిపొవడం ఏంటని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

సినిమా ప్రచారం కోసం ఫ్యాన్స్‌తో గేమ్స్‌ ఆడుతున్నారా..? ఇది పెద్ద స్కామ్(Scam), చీటింగ్(Cheating) అంటూ సోషల్‌ మీడియా వేదికగా వారు సీరియస్‌ అవుతున్నారు. గమనించదగ్గ విషయమేమిటంటే ఇప్పటి వరకు టీ షర్ట్స్‌ అందినట్లు ఎవరూ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కూడా చేయకపోవడం. దీంతో వీళ్లు నిజంగానే టీ షర్ట్స్ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయంటున్నారు అభిమానులు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్ అంటూ.. కనీసం వందల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని ఫ్యాన్స్‌ వాపోతున్నారు.

Updated On 12 July 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story