దర్శకుడు రాజమౌళి(Rajamouli) లేటెస్ట్‌గా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమైన విషయం విదితమే కదా! ఇండియన్ సినిమాకు ఆద్యుడైన దాదా సాహెబ్ ఫాల్కే(Dada Saheb Phalke) బయోపిక్‌ను(Biopic) రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు మేడ్ ఇన్ ఇండియా(Made In India) అని పేరు పెట్టారు. ఇదే కొంత మందికి నచ్చడం లేదు.
దర్శకుడు రాజమౌళి(Rajamouli) లేటెస్ట్‌గా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమైన విషయం విదితమే కదా! ఇండియన్ సినిమాకు ఆద్యుడైన దాదా సాహెబ్ ఫాల్కే(Dada Saheb Phalke) బయోపిక్‌ను(Biopic) రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు మేడ్ ఇన్ ఇండియా(Made In India) అని పేరు పెట్టారు. ఇదే కొంత మందికి నచ్చడం లేదు. ఈ పేరుతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమా పేరు మార్చమంటూ సూచనలు ఇస్తున్నారు. ఇండియా అంటే ఎందుకో ఓ వర్గానికి నచ్చడం లేదు. అంచేత మేడ్ ఇన్ ఇండియా బదులుగా మేడ్ ఇన్ భారత్(Made In Bharath) అని పేరు మార్చమని చెబుతున్నారు. టైటిల్‌ను ఇండియాను తీసేసి భారత్‌ను చేర్చండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకు స్పందించలేదు. భారత చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కథతో ఇది రూపొందనుంది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఎస్.ఎస్.కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ కథ విని రాజమౌళి ఎంతో భావోద్వేగానికి గురయ్యారట! ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పడంతో సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈసినిమాలో టాలీవుడ్ అగ్ర హీరోలు నటించే ఛాన్సుంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథగా ఇది రూపొందనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.