సెలెబ్రిటీలు బయట అడుగుపెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బయట కనిపిస్తే చాలు జనం మూగిపోతున్నారు. వారి అనుమతి తీసుకోకుండానే ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. వీడియోలు తీస్తున్నారు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా వారి అనుమతి లేకుండానే ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు పబ్లిక్‌ ప్లేసుల్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్‌మంటూ కొందరు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

సెలెబ్రిటీలు బయట అడుగుపెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బయట కనిపిస్తే చాలు జనం మూగిపోతున్నారు. వారి అనుమతి తీసుకోకుండానే ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. వీడియోలు తీస్తున్నారు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా వారి అనుమతి లేకుండానే ఆ ఫోటోలను సోషల్‌ మీడియా(Social Media)లలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు పబ్లిక్‌ ప్లేసుల్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్‌మంటూ కొందరు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు కోకొల్లలు. వారి చేష్టలు భరించలేక కొందరు గట్టిగా రియాక్టయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తి మాత్రం స్టార్ హీరోయిన్‌ని అడిగి మరీ ముద్దుపెట్టాడు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషి(Huma Qureshi) తర్లా అనే సినిమా(Tarla Movie) చేశారు. ఈ సినిమా జీ 5 ఓటీటీలో జులై 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్‌లో హ్యుమా ఖురేషి పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ముంబాయి(Mumbai)లో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి మాస్టర్‌ చెఫ్‌ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జ్‌ గ్యారీ మైగెన్‌(Masterchef Australia star Gary Mehigan) హాజరయ్యారు. హ్యుమాతో ఫోటోలకు పోజులిచ్చారు. తర్వాత ముద్దు పెట్టుకోవచ్చా అని హ్యుమాను అడిగాడు మైగెన్‌. ఆమె ఓకే చెప్పడంతో హ్యుమా బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టాడు. ఇలా పర్మిషన్‌ తీసుకుని ముద్దు పెట్టుకోవడపై నెటిజన్లు ఇతడిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా చెఫ్‌ తర్లా దలాల్‌ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తీశారు. తన సింపుల్‌ చిట్కాలతో ఎన్నో అద్భుతమైన వెజిటేరియన్‌ వంటకాలను పరిచయం చేశారు తర్లా. వాటన్నింటినీ పుస్తకాలలో పొందుపరచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆమె కథతోనే తర్లా సినిమా తీశారు. ఇందులో హ్యుమా ఖురేషి టైటిల్ రోల్‌ను పోషించారు.

Updated On 6 July 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story