తెలుగులో పెద్దగా వర్కైట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ(Bollywood) కు చేరాడు బెల్లంకొండ వారి వారసుడు.. సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas). టాలీవుడ్(ollywood) లో వరుసగా పెద్ద పెద్ద సినిమాలు చేసినా.. ఏమాత్రం కలిసి రాలేదు సాయి శ్రీనివాస్ కు. బోయపాటి లాంటి వారు పక్కా మాస్ సినిమాతో.. యాక్షన్ హీరోగా బెల్లంకొండను మార్చే ప్రయత్నం చేశారు. కాని.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా సాయి శ్రీనివాస్ ను నిలబెట్టలేకపోయారు.

అల్లుడు శ్రీను(Alludu Sreenu) సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వెండి తెరకు పరిచయం అయ్యాడు. వినాయక్ లాంటి స్టార్ మాస్ డైరెక్టర్ శ్రీనివాస్ డెబ్యూ బాధ్యతను తీసుకున్నారు. ఈసినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక అంటూ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎనర్జటిక్ యంగ్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు. మంచి మార్కులు కూడా కొట్టేశాడు. రాక్షసుడు సినిమాతో తనలో ఉన్న ఉత్తమ నటుడిని కూడా పరిచయం చేశాడు.
నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు కాని.. టాలీవుడ్ లో సరైన హిట్ ను కొట్టేకపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. దాంతో ఇక బాలీవుడ్ పై కన్నేశాడు యంగ్ హీరో. యూట్యూబ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ఈ యంగ్ హీరో సినిమాలు తెగ చూసేశారు. దాంతో.. బాలీవుడ్ లో ఎలాగైనా పాగా వేయాలని అక్కడ అడుగు పెట్టాడు. తనకు డెబ్యూ సినిమా చేసిన వినాయక్ డైరెక్షన్ లో.. ప్రభాస్ హీరోగా నటించి.. టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన రాజమౌళి సినిమా ఛత్రపతిని.. హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాతో ఎంట్రీకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. ఈ టీజర్ కు బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే సినిమా కోసం చాలా కాలంగా ముంబయ్ లోనే ఉండిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ లో అడుగు పెట్టాడు.
చాలా రోజుల తర్వాత వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు అంతా విమానాశ్రయానికి చేరుకుని శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. పూల దండలు వేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. బెల్లంకొండ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజ్ చూసి... పవర్ స్టార్, మెగాస్టార్ రేంజ్ క్రేజ్ శ్రీనివాస్ కు వచ్చిందంటూ కామెట్ చేస్తున్నారు సినీ జనాలు.