ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టాడు ఓ అభిమాని. కంగారు పడి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేశాడు. ఆయన సెక్కూరిటీ కూడా షాక్ అయ్యేలా అభిమాని తారక్ ను ఎత్తుకోబోయాడు.

స్టార్స్ అంటే ప్రాణం పెడుతుంటారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు స్టార్ సెలబ్రిటీలు. ఎందుకుంటే ఒక్క సారిగా మీదకు వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు కొంత మంది అతభిమానులు. అందుకే బాలయ్య లాంటిస్టార్స్ కాస్త ఓవర్ చేస్తే.. నాలుగు తగిలిస్తుంటారు. అయితే కొంత మంది హీరోలు మాత్రం అలా చేయలేకపోతున్నారు. దాంతో వారికి ఇబ్బుందులు తప్పడంలేదు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు.

కొంత మంది ఫ్యాన్స్ చేసే పనులకు స్టార్ హీరోలు ఇబ్బందుల్లో పడుతుంటారు. చిరాకుపెట్టేవారికి దూరంగా ఉండటానికి గట్టిగా ప్రయత్నిస్తుంటారు. అయినా సరే ఒక్కోసారి ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు తప్పవు స్టార్ హీరోలకు. ఏదైనా పార్టీకో.. ఫంక్షన్ కో వెళ్తే.. చుట్టు ముట్టి చిరాకు పెట్టిస్తుంటారు.. అక్కడా ఇక్కడా అంటూ తాకడం, లాగడం చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అంతే కాదు సెలబ్రిటీ కనిపిస్తే.. చేసే ఇంకో పని సెల్ఫీలు.. ఫోటోలు అంటూ ఎగబడటం..

లేదంటే ఆ సెలబ్రిటీ మీదకు అమాంతంగా దూసుకెళ్లి తమ అభిమాన హీరోలను కౌగిలించుకోవడం.. ఇవన్నీస్టార్స్ కు ఇబ్బందిగా అనిపించినా.. అర్ధం చేసుకోకుండా రిపీట్ చేస్తూనే ఉంటారు. మహేష్, అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ లాంటి చాలా మంది హీరోలు ఈ విషయంలో బాధితులే.. ఇక ఈసారి ఎన్టీఆర్ కు ఓ అభిమాని వల్ల అంతకంటే ఎక్కువగా అనుభవంలోకి వచ్చింది. అతను చేసిన పనికి.. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు తారక్.

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న తారక్ ను ఓ అభిమాని గట్టిగా పట్టేసుకున్నాడు. వదలనంటే వదలను అని ఉడుంపట్టు పట్టాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన దాస్ కా దమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ ముఖ్య అతిదిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో ఆస్కార్ గురించి, విశ్వక్ సేన్ సినిమా గురించి మాట్లాడాడు. స్పీచ్ తర్వాత స్టేజీ దిగుతుండగా.. సడన్ గా ఓ అభిమాని వెనుకనుంచి సెక్యూరిటీ మధ్యకు వచ్చి.. ఎన్టీఆర్ పైకి దూసుకొచ్చి పట్టేసుకున్నాడు. తారక్ ను పైకి లేపే ప్రయత్నం చేశాడు. బౌన్సర్స్అప్రమత్తం అవ్వడంతో.. తారక్ తేరుకుని.. అభిమానికి హగ్ ఇచ్చి.. వదిలేశాడు. దాంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్ కి గురయ్యారు కాసేపు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఇక ఆస్కార్ సాధించిన తరువాత ఆర్ఆర్ఆర్ హీరో మొదటి సారిగా దమ్కీ ప్రీరిలీజ్ లోనే మాట్లాడాడు. ఆర్ఆర్ఆర్ వల్ల వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందడు ఎన్టీఆర్. హాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకర్శించాడు తారక్. ఆస్కార్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పేరు మారుమొగింది. ఆస్కార్ఈవెంట్ గురించి జరిగిన ఓ సర్వేలో.. అక్కడ ఉన్నవారు ఎక్కువగా మాట్లాడుకున్న హీరోలలో ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు తెలిసింది. ఆతరువాత ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నారు. ఇక ఆస్కార్ అఫీషియల్ గా ఫాలో అవుతున్న ఇన్ స్టా గ్రామ్ స్టార్స్ లిస్ట్ లో ఇండియానుంచి ఇద్దరు హీరోలు మాత్రమే ఉండగా.. అందులో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కు ప్లేస్ దక్కింది.

Updated On 18 March 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story