మలయాళ నటి ఐశర్య లక్ష్మి గురించి తెలుగువారికి కూడా అంతో ఇంతో తెలుసు.

మలయాళ నటి ఐశర్య లక్ష్మి గురించి తెలుగువారికి కూడా అంతో ఇంతో తెలుసు. ఆమె సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యాయి. మెడిసిన్‌ చదవిన ఐశ్వర్య లక్ష్మి గ్లామర్‌ ఫీల్డ్‌లో అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అయ్యారు. ఇప్పుడు ఈమె ప్రస్తావన ఎందుకంటే, ఈమె జీవితంలో పెళ్లి చేసుకోదట! సో పెళ్లికి దూరంగా ఉంటున్న హీరోయిన్ల జాబితాలో ఐశ్వర్య లక్ష్మి కూడా చేరిందన్నమాట! చస్తే పెళ్లి చేసుకోననని శపథం బూనారు. 'నేను నా జీవితంలో పెళ్లి చేసుకోను. ఇది ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయం కాదు. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నాకు తెలిసిన చాలా దంపతులను చూశాను. ఒక జంట తప్ప, మిగతా భార్యాభర్తలంతా రాజీ పడుతున్నారు. ఈ పెళ్లిళ్ల వల్ల చాలామంది వ్యక్తిగతంగా ఎదగలేకపోవడం కూడా నేను చూశాను. అందుకే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను' అని ఐశ్వర్య లక్ష్మి స్పష్టం చేశారు. పాతికేళ్ల వయసు వరకు తాను కూడా పెళ్లి గురించి చాలా కలలు కన్నానని, ఇప్పుడు పెళ్లి అసలు రూపం తనకు తెలిసి వచ్చిందని ఐశ్వర్య లక్ష్మి అంటున్నారు. గురువాయూర్‌ ఆలయంలో తాను ఎన్నో పెళ్లిళ్లు చూశానని, అవి చూసినప్పుడల్లా తాను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, ఇప్పుడు పెళ్లంటే ఏమిటో జ్ఞానోయదం అయ్యిందని చెప్పారు.

' అప్పట్లో పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాను. ఒకానొక సమయంలో మ్యాట్రిమొని సైట్‌లో నా సొంత డబ్బులతో ప్రొఫైల్ కూడా పెట్టాను. చాలా మంది అది ఫేక్‌ ప్రొఫైల్‌ అనుకున్నారు. అందుకే ఎవరూ రెస్పాండ్‌ అవ్వలేదు. అటు పిమ్మట పెళ్లిపై నా అభిప్రాయం మారింది' అని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. 34 ఏళ్ల వయసున్న ఐశ్వర్య లక్ష్మికి 29 ఏళ్లకే పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందట! పెళ్లి విషయంలో తనను ఎవరూ ప్రభావితం చేయలేరని అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో సాయిదుర్గతేజ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి,

ehatv

ehatv

Next Story