పేరులో ఏముందన్నాడు షేక్స్‌ఫియర్‌! ఉన్నదంతా పేరులోనేనని అంటున్నారు సెలెబ్రిటీలు! ఇలా పేర్లు మార్చుకున్నవారిని చాలా మందిని మనం చూసి ఉన్నాం! మారిన పేరు విజయానికి బాటలు వేస్తుందన్నది వారి నమ్మకం.

పేరులో ఏముందన్నాడు షేక్స్‌ఫియర్‌! ఉన్నదంతా పేరులోనేనని అంటున్నారు సెలెబ్రిటీలు! ఇలా పేర్లు మార్చుకున్నవారిని చాలా మందిని మనం చూసి ఉన్నాం! మారిన పేరు విజయానికి బాటలు వేస్తుందన్నది వారి నమ్మకం. ఇప్పుడా లిస్ట్‌లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌(Puri jagannadh) కొడుకు ఆకాశ్‌ పూరీ(Akash puri) కూడా చేరాడు. తన పుట్టిన రోజు సందర్భంగా పేరు మార్చుకున్న విషయాన్ని చెప్పాడు. ఇకపై తన పేరు ఆకాశ్‌ పూరీ కాదని, ఆకాశ్‌ జగన్నాథ్‌(Akash Jagannadh) అని ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) అకౌంట్‌లో పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడికి అందరూ బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నారు. అయితే పేరు మార్చుకోవడానికి వెనుక ఉన్న కారణమేమిటో ఆకాశ్‌ చెప్పలేదు. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించిన ఆకాశ్‌ జగన్నాథ్‌ ఆంధ్రాపోరితో హీరో అయ్యాడు. తర్వాత మెహబూబా, రొమాంటిక్‌, చోర్‌ బజార్‌ వంటి సినిమాల్లో నటించాడు. ఏ సినిమా కూడా అతడికి బ్రేక్‌ త్రూ ఇవ్వలేదు. ఇప్పుడు పేరు మారిన తర్వాతైనా హిట్‌ కొడతాడేమో చూడాలి!

Eha Tv

Eha Tv

Next Story