ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 : ది రూల్‌(Pushpa 2 : The Rule) సినిమా కోసం అభిమానులు కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ సినిమా రాకపోవడం ఇందుకు కారణం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బన్నీ అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప పార్ట్‌ వన్‌ అనుకున్నదాని కంటే పెద్ద హిట్టయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ నేషనల్‌ స్టార్‌ అయ్యారు.

అన్ని భాషలలో ఈ సినిమా విజయవంతం అయ్యింది. అందుకే పార్ట్‌ టూ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌(Red Sandle Smuggling) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా కనిపించిన ఫహాద్‌ ఫాజిల్‌(Fahad Fazil) యాక్టింగ్‌ ఓ రేంజ్‌లో ఉండబోతున్నదట! ఎంతో గొప్ప నటుడైన ఫహాద్‌కు ఇలాంటి రోల్స్‌ దొరికితే ఆటాడుకుంటారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఫహాద్‌ ఫాజిల్‌ అభిమానులతో పంచుకున్నారు. 'పుష్ప-2 లో నా పాత్ర పార్ట్-1 కంటే కాస్తా ఎక్కువగానే ఉంటుంది.

హీరోకు, నాకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు(action Scenes) ఉంటాయి. పార్ట్‌ -2లో మొత్తం ఎక్కువగా ఫైట్స్ ఉండనున్నాయి.' అని ఫహాద్‌ తెలిపారు. ఫహాద్‌ స్టేట్‌మెంట్‌ చూసి బన్నీ ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్‌లో భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. కాగా..పుష్ప-2లో టాలీవుడ్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పుష్ప-2లో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బన్నీ సరసన నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated On 3 July 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story