కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) ఈ సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. మన ఇండియన్ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై కాలు పెట్టారు. వెరైటీ కాస్ట్యూమ్స్‌తో సెలబ్రిటీలు అబ్బురపరిచేలా సెక్సీ లుక్స్‌తో అటెండ్ అయ్యారు. అయితే జన్నత్ 2 భామ ఈషా గుప్తా (Esha Gupta) ప్రపంచంలోనే అత్యంత గ్లామరస్‌గా రెడ్ కార్పెట్‌పై కాలుమోపింది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) ఈ సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. మన ఇండియన్ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై కాలు పెట్టారు. వెరైటీ కాస్ట్యూమ్స్‌తో సెలబ్రిటీలు అబ్బురపరిచేలా సెక్సీ లుక్స్‌తో అటెండ్ అయ్యారు. అయితే జన్నత్ 2 భామ ఈషా గుప్తా (Esha Gupta) ప్రపంచంలోనే అత్యంత గ్లామరస్‌గా రెడ్ కార్పెట్‌పై కాలుమోపింది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ. గులాబీ రంగు గౌనులో ఈషా రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వచ్చింది. ఆ గౌనుతోపాటు ఆమె మెడలో సెన్సిటివ్‌గా ఉండే లేస్ పూలతో మెరిసిపోయింది. ఆమె రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టడం సాధారణంగా ఉన్నప్పటికీ.. ఆమె అవాంత్-గార్డె క్లాత్‌తో తయారు చేసిన గౌను అందరినీ ఆకర్షించింది. ప్రతిష్టాత్మకమైన 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఆమె సక్సెస్ ఫుల్‌గా నడిచింది. ఆమె ఆ లుక్‌లో అదిరిపోయిందని చెప్పాలి.
ఆమె అందమైన గౌనుతోపాటు ఫ్రెడ్ ప్యారిస్ జువెలరీ నుంచి తెల్లటి ఉంగరం, చెవిపోగులు ధరించింది ఈషా(Esha). ఆమె జుట్టు అంతా చుట్టేసి.. ఫేస్‌కి రెండువైపులా వదులుగా ఉంచడంతోపాటు చాలా తక్కువ మేకప్ వేసుకుంది ఈ భామ. విక్టర్ బ్లాన్కో తోపాటు ఒక స్టైలిష్ ఆమెకు అందమైన రూపాన్ని అందించారు. కేన్స్ కు ఇంతకు ముందు వచ్చిన ఈషా.. స్ట్రిప్డ్ టీ షర్ట్ ఔట్ ఫిట్‌లో మెరిసింది. ఎలాంటి మేకప్ లేకుండా జుట్టును వదులుగా ఉంచి.. బ్రౌన్ టింటెడ్ సన్ గ్లాసెస్‌తో మెరిసింది ఈ జన్నత్ భామ. గ్రీన్ కలర్ హీల్స్తోపాటు టర్కోయిస్ స్లింగ్ బ్యాగ్ వెంట తెచ్చుకుంది. ఇక తాజాగా ఈషా గుప్తా ప్రకాష్ ఝాతో కలిసి ఆశ్రం3 (Aashram3)లో నటిస్తోంది. బాబీ డియోల్ నిరాలా బాబా పాత్ర చేస్తున్నాడు. ఈషా సోనియా క్యారెక్టను పోట్రెయిట్ చేస్తోంది