ఒకప్పటి అగ్రహీరో ధర్మేంద్ర(Dharmendra) ఇప్పుడెక్కువగా సినిమాలు చేయడం లేదు. 90 ఏళ్లుపై పడ్డాయి కాబట్టి ఫామ్‌హౌజ్‌లోనే చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పట్లో ధర్మేంద్ర అంటే అమ్మాయిల్లో బాగా క్రేజ్ ఉండేది. ఇటీవలే సరదాగా రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ(Rocky aur Rani Ki Prem Kahani) అనే సినిమాలో సరదగా నటించారు. ఆ సినిమాతో ధర్మేంద్ర మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అందుకు కారణం ఈ వయసులో ఆ సినిమాలో లిప్‌లాక్(Lip Kiss) చేయడం. అది కూడా ఒకప్పటి తన సహనటి షబానా ఆజ్మీతో(Shabana Azmi)..

Esha Deol
ఒకప్పటి అగ్రహీరో ధర్మేంద్ర(Dharmendra) ఇప్పుడెక్కువగా సినిమాలు చేయడం లేదు. 90 ఏళ్లుపై పడ్డాయి కాబట్టి ఫామ్‌హౌజ్‌లోనే చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పట్లో ధర్మేంద్ర అంటే అమ్మాయిల్లో బాగా క్రేజ్ ఉండేది. ఇటీవలే సరదాగా రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ(Rocky aur Rani Ki Prem Kahani) అనే సినిమాలో సరదగా నటించారు. ఆ సినిమాతో ధర్మేంద్ర మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అందుకు కారణం ఈ వయసులో ఆ సినిమాలో లిప్‌లాక్(Lip Kiss) చేయడం. అది కూడా ఒకప్పటి తన సహనటి షబానా ఆజ్మీతో(Shabana Azmi).. ఆ ముద్దు సన్నివేశంలో ఇద్దరూ గొప్పగా నటించేశారు. దర్శకుడు కట్ చెప్పగానే లోకేషన్‌లో అందరికీ వినిపించేలా బహుత్ మజా ఆయా అని ధర్మేంద్ర అంటూ అందరినీ తెగ నవ్వించారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా ఈ ముద్దు సీన్‌ను బాగా ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ ఈ ముద్దుపై వివరణ ఇచ్చుకున్నారు. 'సినిమాల్లో ముందు పెట్టుకుంటే తప్పేమిటి. మా నాన్న రొమాంటిక్. కవితాత్మక హృదయం కలవాడు. అయినా ప్రేమకీ, ముద్దుకీ వయసుతో సంబంధం లేదు. షబానా ఆంటీ కూడా మోర్ రొమాంటిక్. ఇద్దరూ పాత్ర కోసం ప్రాణం ఇచ్చేవారే. అందుకే ఇష్టంగా చేశారు. అందులో తప్పేముంది? ' అని అన్నారు ఈషా డియోల్(Esha Deol)!
