✕
Pooja Bhalekar : యూత్‌లో వేడిపుట్టించేలా మార్షల్ ఆర్ట్స్ భామ అందాల ఆరబోత.. !
By EhatvPublished on 18 April 2023 5:52 AM GMT
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన సినిమాయే లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki: Enter the Girl Dragon). ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఆర్జీవీ అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోయారు. ఎవరీ అమ్మాయి తన బాడీని స్వింగ్లా తిప్పుతోందని, ఫైట్స్ అయితే ఓ రేంజ్లో చేస్తోందని.. ఆ అమ్మాయి ఎవరా అని అందరూ గూగుల్ తల్లిని అడగటం మొదలెట్టారు.

x
Pooja Bhalekar
-
- సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన సినిమాయే లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki: Enter the Girl Dragon). ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఆర్జీవీ అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోయారు. ఎవరీ అమ్మాయి తన బాడీని స్వింగ్లా తిప్పుతోందని, ఫైట్స్ అయితే ఓ రేంజ్లో చేస్తోందని.. ఆ అమ్మాయి ఎవరా అని అందరూ గూగుల్ తల్లిని అడగటం మొదలెట్టారు.
-
- ఆ సినిమా ట్రైలర్‌తో రెండు రాష్ట్రాల యూత్‌లో సెగలు పుట్టించింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయే పూజా భాలేకర్ (Pooja Bhalekar). గతేడాది వచ్చిన ఈ సినిమాతో పూజా భాలేకర్ (Pooja Bhalekar) తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
-
- ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం (martial arts film) అంటూ టాలీవుడ్లోకి ఎంటర్ అయింది. అయితే ఆమె నటించిన మొదటి చిత్రంతోనే ప్యాకప్ చెప్పేసింది ఈ మార్షల్ ఆర్ట్స్ బ్యూటీ. ఇటు పూజా మార్షల్ ఆర్ట్స్‌కి అటు ఆమె అందానికి అంతా ఫిదా అయ్యారు.
-
- ఓ ఆడ పిల్ల ఫైట్ చేస్తే ఇంత బాగుంటుందని అని నోరెళ్లబెట్టారు. ఈ భామ ఇంత కష్టపడ్డా కూడా ఆమెను టాలీవుడ్ లో అదృష్టం వరించలేదు. ఈ లడ్కీ చిత్రాన్ని ఆర్జీవీ ఎంతో ప్రెస్టిజియస్‌గా తీసుకున్నారు. ఈ సినిమాలో చైనా (Chaina) ఆర్టిస్టులు కూడా నటించారు. అయితే ఇండోచైనా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
-
- ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మించారు. ఈ చిత్రాన్ని 40,000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను తీయడానికి గల మెయిన్ కారణం బ్రూస్లీ అన్నారు డైరెక్టర్. శివ (Shiva), ఎంటర్ ది డ్రాగన్ (Enter the Dragon) చిత్రాల ఇన్స్పిరేషన్తో ఈ సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు.
-
- బ్రూస్లీ (Bruce Lee) సినిమాలతోపాటు తన నిజ జీవితంలో కొన్ని ఎన్కౌంటర్ల నుంచి రీసెర్చ్ చేసిన దాని ఆధారంగా ఈ సినిమాను ప్రిపేర్ చేసినట్టు రాము అన్నారు. ఈ కాంటెంట్‌కు మార్షల్ ఆర్ట్స్‌ని యాడ్ చేసి సినిమా తీసినట్టు చెప్పారు. అయితే బ్రూస్లీ (Bruce Lee) తరహాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే వ్యక్తిని సినిమాలో పెట్టడం కష్టమని.. సో ఒక ఉమెన్ (Women)ని ఎందుకు పెట్టకూడదనే ఆలోచన తనకు వచ్చినట్టు తెలిపారు.
-
- అయితే మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో ఆ క్యారెక్టర్‌కు తగ్గా అమ్మాయిని వెతికే పనిలోపడ్డట్టు చెప్పారు. అలా పూజా (Pooja)ను కలవడం జరిగిందని.. పూజా భాలేకర్ టాలెంట్‌కు ఆయన షాక్ అయినట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ను డిజైన్ చేశానని.. అందుకు సంబంధించిన రియల్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ స్టంట్స్ అన్ని కూడా పూజా భాలేకరే చేసిందని.. పూజా యాక్షన్స్ సీన్స్ చూసి షాక్ అయ్యానని ఆర్జీవీ (RGV) అన్నారు.
-
- ముఖ్యంగా ఈ చిత్రంలో ఫైట్ సీక్వెన్స్ అన్నీ కూడా పూజా భాలేకరే (Pooja Bhalekar) డిజైన్ చేసిందన్నారు. ఆమెకు మార్షల్ ఆర్ట్స్‌తో సినిమాలపైనా ఆసక్తి ఉండటంతో.. టెస్ట్ షూట్ చేశాక.. ఆమెను ఈ చిత్రంలోకి తీసుకున్నట్టు కూడా చెప్పారు. ఈ సినిమాలో పూజా తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. పూజా కార్నిక్ (Pooja Karnik) పాత్ర చేయడం చాలా బాధ్యతగా అనిపించిందని చెప్పింది.
-
- ఇక మరోవైపు బ్రూస్ లీకి పెద్ద అభిమానినని.. బ్రూస్ లీ చేసిన దానిలో ఈ సినిమా ద్వారా నేను 10 శాతం మాత్రమే చేసినప్పటికీ చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది పూజా భాలేకర్ (Pooja Bhalekar). ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత ఆమెకు సెకండ్ ఛాన్స్ రాలేదు. మొదటి సినిమాతోనే ఆగిపోయానన్న కసో ఏమోగాని.. ఆ ఫైర్ మొత్తం తన గ్లామర్ షోతో సోషల్ మీడియాపై దాడి చేస్తోంది ఈ బ్యూటీ. బికినీలో చేసే ఈమె గ్లామర్ షోకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మరి.
-
- ఈ మార్షల్ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో 256k ఫాలోవర్లు ఉన్నారు. ఈ భామ పోస్ట్ చేసిన 71 పోస్టులో అంతా గ్లామర్ షోనే. ఈ భామ ఫొటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ భామను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లక్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి మరి.

Ehatv
Next Story