మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్(Mahadev Online Bwtting Scam) కేసు బాలీవుడ్‌ను వణికిస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు(summoned) ఇచ్చేందుకు ఈడీ(ED) సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు(Ranbir kapoor) ఈడీ నోటీసులు జారీ చేసింది.
మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్(Mahadev Online Bwtting Scam) కేసు బాలీవుడ్‌ను వణికిస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు(summoned) ఇచ్చేందుకు ఈడీ(ED) సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు(Ranbir kapoor) ఈడీ నోటీసులు జారీ చేసింది. మహాదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాకప్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయనకు నోటీసులు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 6వ తేదీన విచారణకు(Ivestigation) రావాలని ఆదేశించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు సౌరభ్ చక్రవర్తి(Saurabh Chakraborty), రవి ఉప్పల్ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల సౌరభ్ చంద్రకర్ వివాహం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని 6వ అతి పెద్ద నగరం రాక్‌లో జరిగిన ఆ పెళ్లికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. బంధుమిత్రులను, సెలబ్రిటీలను దుబాయ్‌కు తీసుకురావడానికి ప్రైవేట్ జెట్స్‌ను ఏర్పాటు చేశాడట! దీనికి సంబంధించిన చెల్లింపులను హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించినట్టు సమాచారం. దీంతో ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు కూడా ఈడీ నోటీసులు పంపించే అవకాశం ఉంది. ఈ పెళ్లి వేడుకకు హాజరైన సెలెబ్రిటీలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా డబ్బు అందుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మహాదేవ్ బుక్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల్లో ఈడీ విచారణ జరుపుతోంది.