తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు మూడు దశాబ్దాల పాటు మంచానికే పరిమితమైన హీరో తుది శ్వాస విడిచారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిపోయిన తమిళ కథానాయకుడు బాబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా(Bharti Raja) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన బాబు(Babu) 1990లో హీరో అయ్యారు.
తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు మూడు దశాబ్దాల పాటు మంచానికే పరిమితమైన హీరో తుది శ్వాస విడిచారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిపోయిన తమిళ కథానాయకుడు బాబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా(Bharti Raja) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన బాబు(Babu) 1990లో హీరో అయ్యారు. ఎన్ ఉయిర్ తోజన్(En uyir tojan) అనే సినిమాతో కథానాయకుడయ్యారు. ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఆయన అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. తర్వాత పెరుంపుల్లి, తాయమ్మ, పొన్నుకు చేతి వందచు వంటి సినిమాల్లో హీరోగా నటించారు. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు బాబుకు బాగా నప్పుతాయని తమిళ పరిశ్రమ చెప్పుకుంటున్న సమయంలో తన అయిదో సినిమా మనసారా పరిహితంగానే సినిమాలో నటించారు. ఈ సినిమానే బాబు జీవితాన్ని అంధకారంలో నెట్టింది. షూటింగ్ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ ఫైట్ సీన్(Fight scene) చిత్రీకరించారు. ఆ ఫైట్ సీన్‌లో హీరో నేలపై నుంచి దూకాలి. నిజంగానే జంప్ చేస్తానని బాబు చెప్పినప్పటికీ చిత్ర యూనిట్ అందుకు ఒప్పుకోలేదు. డూప్ పెడదామని దర్శకుడు ఎంత చెప్పినా వినలేదు. రియలిస్టిక్‌గా ఉంటుందంటూ బాబు నిజంగానే జంప్ చేశారు. దురదృష్టవశాత్తూ అనుకున్న చోటులో కాకుండా మరో చోట బాబు పడిపోయారు. వీపుపై బలమైన గాయం అయ్యింది. ఎముకలు విరిగిపోయాయి. వెన్నెముకకు సర్జరీ జరిగినా బాబు కోలేకోలేదు. నిటారుగా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. బాబు కుటుంబం చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించారు. చికిత్స అందించారు. కానీ అవేమీ పని చేయలేదు. సెట్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడి 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన బాబు మరణించాడనే వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు భారతీరాజా. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని తాను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాంటూ సంతాపం ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే దర్శకుడు భారతీరాజా బాబును స్వయంగా పలకరించి వచ్చారు. అయితే ఆ షూటింగ్ సమయంలో బాబుకు గాయాలైన తర్వాత మరో హీరోతో మనసారా పరిహితంగానే సినిమా తీసినట్లు తెలుస్తోంది. బలమైన కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి జీవితాన్ని ఫైట్ సీన్ ముగించింది. బాబుకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఎంజీఆర్, జయలలిత కాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, స్పీకర్‌గా అనేక పదవులను నిర్వహించిన కె. రాజారాం ఆయనకు మామ అవుతారు.