టెలివిజన్ రంగంలో ఏక్తా కపూర్(Ekta Kapoor) ఓ సంచలనాన్ని క్రియేట్ చేసింది. జీడిపాకంలాంటి సీరియల్స్‌కు ఆమె ఆద్యురాలు. అలాగే అత్తా కోడళ్ల కోట్లాటలు, లేడి విలన్లు, మర్డర్లు ఇవన్నీ టీవీ సీరియల్స్‌లలో జొప్పించింది కూడా ఏక్తా కపూరే! అలనాటి హీరో జితేంద్ర(Jithendra), శోభా కపూర్(Shobha) కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏక్తా కపూర్ సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు.
టెలివిజన్ రంగంలో ఏక్తా కపూర్(Ekta Kapoor) ఓ సంచలనాన్ని క్రియేట్ చేసింది. జీడిపాకంలాంటి సీరియల్స్‌కు ఆమె ఆద్యురాలు. అలాగే అత్తా కోడళ్ల కోట్లాటలు, లేడి విలన్లు, మర్డర్లు ఇవన్నీ టీవీ సీరియల్స్‌లలో జొప్పించింది కూడా ఏక్తా కపూరే! అలనాటి హీరో జితేంద్ర(Jithendra), శోభా కపూర్(Shobha) కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏక్తా కపూర్ సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. రాగిణి ఎంఎంఎస్(Ragini MMS), ది డర్టీ పిక్చర్(the Disater Pictures), షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.లేటెస్ట్‌గా భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన భూమికులు పోషించిన థాంక్యూ ఫర్ కమింగ్(Thanks For Comming) అనే సినిమాను నిర్మించారు. దీనికి కరణ్ బులానీ(Karan Bulani) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రియా కపూర్, అనిల్ కపూర్‌లతో కలిసి ఏక్తా కపూర్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ అడల్ట్ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లలో భాగంగా నిర్మాత ఏక్తా కపూర్ ట్విట్టర్(Twitter) వేదికగా ఆస్క్ మీ ఎనిథింగ్(Ask Me anything) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నెటిజన్లలో అత్యధికులు ఏక్తా కపూర్‌ను తిట్టిపోశారు. 'నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. 'నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలా మందిని చెడగొడుతున్నారు. ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణం' అని కొందరు కామెంట్ చేశారు. దీనికి ఏక్తా కపూర్ అవునా అంటూ రిప్లై ఇచ్చారు. 'దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానేయండి అని కొందరు విన్నవించుకున్నారు. దీనికి మాత్రం ఏక్తా కపూర్ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ' ఆ ఛాన్సే లేదు.. నేను ఒక అడల్ట్ కాబట్టి అలాంటి సినిమాలే చేస్తాను' అని జవాబిచ్చారు. అలసు నెటిజన్ల విమర్శలను ఏక్తా కపూర్ ఏ మాత్రం పట్టించుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది..