✕
Eha Morning Top Five News : టాప్ 5 న్యూస్..!
By EhatvPublished on 23 March 2023 11:55 PM GMT
ఏపీ(AP)లో వచ్చే మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ(Telangana), దక్షిణ ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), ఒడిశా(disha) మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati Weather Station) తెలిపింది.

x
eha today top 5 news
-
- ఏపీ(AP)లో వచ్చే మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ(Telangana), దక్షిణ ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), ఒడిశా(disha) మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati Weather Station) తెలిపింది.
-
- అమెరికా(America) మరో గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటక, వ్యాపార వీసాల(Visa)తో అమెరికాకు వచ్చేవారు ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ తెలిపింది. అయితే ఉద్యోగంలో చేరే ముందు వీసాను మార్చుకోవాల్సిన ఉంటుందని వివరించింది. బీ 1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసా(B2 Visa)ను టూరిస్టులకు అమెరికా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దేశం తీసుకున్న నిర్ణయంతో ఈ రెండు వీసాలు కలిగిన వారు ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం దొరక్కపోతే అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్(Grace period) ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.
-
- Plane crash ) ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. బార్వాడా ఎయిర్‌స్ట్రిప్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌తో పాటు 14 ఏళ్ల బాలుడు గాయపడ్డారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఎయిర్‌పోర్ట్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న ఇంటిని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
-
- తమిళ స్టార్(Tamil Hero) అజిత్ (Ajith Kumar)ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన తండ్రి(Father) సుబ్రహ్మణ్యం అనారోగ్యం(Subramanyam Health)తో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యల(Health Issues)తో బాధపడుతున్న ఆయన చెన్నై(Chennai)లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ ప్రముఖులు సంపాతం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు.
-
- ఎవరెన్ని చెప్పినా మన భారతీయ వంటకాలే వంటకాలు(Indian cuisine)! అందుకే విదేశీయులు మన వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారు. ప్రపంచం(World)లోని అత్యుత్తమ వంటకాల చిట్టా తీస్తే మన వంటకాలే ఎక్కువగా అందులో ఉంటాయి. లేటెస్ట్గా టాప్-50 వంటకాలలో ఎనిమిది వెరైటీలకు చోటు దక్కడం విశేషం. షాహీ పనీర్(Shahi paneer ) అయిదో స్థానంలో, కీమా(Keema) పదో స్థానంలో, చికెన్ కుర్మా(Chicken Kurma) 16వ స్థానంలో, దాల్(Dal) 26వ స్థానంలో, విందాలూ 31వ స్థానంలో, వడాపావ్(Vada pav) 39వ స్థానంలో, దాల్ తడ్కా 40వ స్థానంలో నిలిచాయి. చిత్రమేమిటంటే 38వ స్థానంలో ఉన్న ఇండియన్ ఫుడ్(Indian Food) చికెన్ టిక్కా(Chicken tikka)ను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం. ఈ జాబితాలో థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Ehatv
Next Story