ఈషా రెబ్బ(Eesha Rebba).. అచ్చంగా పదహారణాల తెలుగమ్మాయి. మన వరంగల్‌ అమ్మాయే.. లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌(Life is beautifull) సినిమాతో సినిమాల్లో అడుగుపెట్టారు. అంతకు ముందు ఆ తర్వాత(anthaku Mundhu aa Tharuvatha) సినిమా ఈషా రెబ్బకు మంచి పేరు తెచ్చింది. అమీ తుమీలో(Ami thumi) ఈమె నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఈషాకు అవార్డులు కూడా వచ్చాయి.

ఈషా రెబ్బ(Eesha Rebba).. అచ్చంగా పదహారణాల తెలుగమ్మాయి. మన వరంగల్‌ అమ్మాయే.. లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌(Life is beautifull) సినిమాతో సినిమాల్లో అడుగుపెట్టారు. అంతకు ముందు ఆ తర్వాత(anthaku Mundhu aa Tharuvatha) సినిమా ఈషా రెబ్బకు మంచి పేరు తెచ్చింది. అమీ తుమీలో(Ami thumi) ఈమె నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఈషాకు అవార్డులు కూడా వచ్చాయి. అవె(Awe )సినిమాలో ఈమె లెస్బియన్‌గా(Lesbian) నటించారు. ఇది కూడా ఆమెకు మంచి పేరు తెచ్చింది. బ్రాండ్‌ బాబు(Brand babu), అరవింద సమేత వీర రాఘవ(Aravinda Sametha Veera Raghava), మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌(Most eligible bachelor), సుబ్రహ్మణ్యపురం(Subrahmanyapuram), సవ్యసాచి(Savyasachi) సినిమాల్లో నటించారు.

మలయాళ సినిమాలోనూ ఈషా రెబ్బ నటించారు. ఈ అందమైన తెలుగు అమ్మాయి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలుగు సినిమా అవకాశాల గురించి మాట్లాడారు. 'నేను ఇతర భాషా చిత్రాలలో నటిస్తున్నప్పుడు అక్కడి వారంతా తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే గర్వంగా ఫీలయ్యేదాన్ని. అయితే మన దగ్గర మాత్రం పర భాషా నాయికలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర భాషల హీరోయిన్లు మాత్రమే కావాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేయరు కదా? మరి అలాంటప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడంలో అంతర్యమేమిటో అర్థం కాదు' అని ఈషా రెబ్బ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె మాయా మశ్చీంద్ర(Maya Mashindra), దయా’(Daya) చిత్రాల్లో నటిస్తున్నారు. ఈషా రెబ్బ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కదా!

Updated On 10 July 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story