ఈమె తెలుగమ్యాయి. అచ్చమైన తెలంగాణ అమ్మాయి. అనేక సీరియల్స్‌లో చక్కగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు. ఆమె సినీ కెరీర్‌ త్రిషకు(Trisha) ఫ్రెండ్‌గా నటించిన సినిమాతో మొదలయ్యింది. అదే ఏడాది హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఈమె తెలుగమ్యాయి. అచ్చమైన తెలంగాణ అమ్మాయి. అనేక సీరియల్స్‌లో చక్కగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు. ఆమె సినీ కెరీర్‌ త్రిషకు(Trisha) ఫ్రెండ్‌గా నటించిన సినిమాతో మొదలయ్యింది. అదే ఏడాది హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు అంతగా విజయం సాధించలేదు. ఇప్పుడైనా ఆమె ఎవరో గుర్తుకొచ్చిందా? ఈ అమ్మాయి పేరు రేష్మా రాథోడ్‌(Reshma Rathore).. ఇంకా గుర్తుకురాలేదా? అదేనండి వెంకటేశ్(Venkatesh)-త్రిష(Trisha) హీరో హీరోయిన్లుగా నటించిన బాడీగార్డ్‌(Bodygaurd) సినిమాలో త్రిషకు ఫ్రెండ్‌గా నటించారు రేష్మా.

అదే ఏడాది ఆమె కథానాయికగా నటించిన ఈ రోజుల్లో(Ee Rojulo) సినిమా వచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్‌ సక్సస్‌ అందుకున్నారు. తర్వాత ఎందుకో ఆమె తన కెరీర్‌ను సరిగ్గా ప్లాన్‌ చేసుకోలేకపోయారేమోనని అనిపిస్తోంది. ఈ రోజుల్లో తర్వాత జై రామ్, లవ్‌ సైకిల్‌, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం, మలయాళ సినిమా అప్పవువ్‌ వీంజుమ్‌, తమిళ సినిమా అదగపట్టత్తు మగజననంగలయ్‌ వంటి సినిమాల్లో నటించారు. కాకపోతే ఇందులో ఏ సినిమా కూడా ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. దీంతో 2017 తర్వాత నటనకు కంప్లీట్‌గా బ్రేక్‌ ఇచ్చారు. రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీలో(BJP) చేరారు. అదే సమయంలో లా చదివారు. నటిగా రేష్మా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినప్పటికీ లాయర్‌గా మాత్రం తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. మొన్న జులైలో సుప్రీం కోర్టు లాయర్‌గా(Supreme Court Lawyer) పదోన్నతి పొందారు. ఇకపోతే అప్పట్లో ఒకలా ఉన్న రేష్మా ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. అందుకే చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోయారు. ఓ తెలుగు హీరోయిన్‌ సుప్రీంకోర్టు లాయర్‌ కావడం మాత్రం అభినందనీయమే!

Updated On 1 Sep 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story