రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టిన నటి దుషారా విజయన్(Dushara Vijayan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన సార్పట్టా పరంపరై(Sarpatta Paramparai) సినిమా చూసిన వారు దుషారాను అంత తొందరగా మర్చిపోలేరు. హీరో ఆర్యకు(arya) జంటగా నటించిన దుషారా అద్భుతమైన నటనను కనబర్చారు.

Dushara Vijayan
రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టిన నటి దుషారా విజయన్(Dushara Vijayan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన సార్పట్టా పరంపరై(Sarpatta Paramparai) సినిమా చూసిన వారు దుషారాను అంత తొందరగా మర్చిపోలేరు. హీరో ఆర్యకు(arya) జంటగా నటించిన దుషారా అద్భుతమైన నటనను కనబర్చారు. ఆ తర్వాత పా.రంజిత్ దర్శకత్వంలోనే వచ్చిన నక్షిత్రమ్ నగరగిరదు(Nakshithram Nagaragiradhu) సినిమాలో మరోసారి నటిగా తానేమిటో రుజువు చేసుకున్నారు దుషారా. ఇప్పుడు వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందుతున్న అనిత చిత్రంలో నటుడు అర్జున్‌దాస్‌తో(Arjun das) పోటీ పడి నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం బాలజీ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా విజయన్ ఈ సినిమాతో పాటు హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని కూడా సంపాదించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దుషారా నటనపై తనకు ఉన్న అభిరుచిని చెప్పారు. నటన అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమని అన్నారు. అయితే సినిమాలో తన పాత్ర అయిదు నిమిషాలు మాత్రమే ఉన్నా సరే, దానికి ప్రాధాన్యత ఉండాలని తెలిపారు.
'కుటుంబ కథా చిత్రాల నటిగా ఇమేజ్ తెచ్చుకున్న మీరు గ్లామర్ పాత్రలో నటిస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది. అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదు' అని దుషారా వివరించారు. అందాల ఆరబోతలో తనకు హద్దులు తెలుసని, అలాంటి పరిమితులతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. తనకు దర్శకులు బాలు మహేంద్ర, మణిరత్నం అంటే చాలా ఇష్టమని దుషారా తెలిపారు.
