వరుసగా రెండు పెద్ద విజయాలతో జోరు మీద ఉన్న బాలీవుడ్ బాద్ షాకు ముచ్చటగా మూడోమూవీ షాక్ ఇచ్చింది. డంకీ(dunki) సినిమాతో పెద్ద షాక్ తగిలింది. ఇక సలార్(Salaar) రిలీజ్ తో డంకీ ఇంకాస్త డీలాపడింది. దాదాపు ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు షారుఖ్(Shah Rukh Khan). వరుస డిజాస్టర్లు.. కుటుంబ సమస్యలు, షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో(Aryan Drugs case) అరెస్ట్ అవ్వడం.. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలి డీలా పడ్డాడు.

వరుసగా రెండు పెద్ద విజయాలతో జోరు మీద ఉన్న బాలీవుడ్ బాద్ షాకు ముచ్చటగా మూడోమూవీ షాక్ ఇచ్చింది. డంకీ(dunki) సినిమాతో పెద్ద షాక్ తగిలింది. ఇక సలార్(Salaar) రిలీజ్ తో డంకీ ఇంకాస్త డీలాపడింది. దాదాపు ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు షారుఖ్(Shah Rukh Khan). వరుస డిజాస్టర్లు.. కుటుంబ సమస్యలు, షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో(Aryan Drugs case) అరెస్ట్ అవ్వడం.. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలి డీలా పడ్డాడు. ఇక రీ ఎంట్రీతో సాలీడ్ సక్సెస్ సాధించాడు షారుక్. పటాన్ సినిమాతో వెయ్యికోట్ల సినిమాను బాలీవుడ్ కు అందించాడు. ఆతువాత సౌత్ డైరెక్టర్ అట్లీదో అదరిపోయేలా జావాన్ సినిమా చేసి.. ఈమూవీ కూడా వెయ్యికోట్లు కలెక్షన మార్క్ దాటేలా కష్టపడ్డాడు. ఇక ముచ్చటగా మూడో సారి వెయ్యి కోట్ల సినిమా అందించి రికార్డ్ సృష్టిద్దాం అనుకుంటే.. షారుఖ్ హ్యాట్రిక్ పై నీల్లు చల్లినట్టు అయ్యింది.

బాలీవుడ్ సీనియర్ దర్శకుడు. సక్సెస్ కు చిరనామాగా నిలిచిన రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ ను షారుఖ్ డంకీ’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న హిందీలో విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమా బాక్సాఫీస్ అంతగా సెన్సెషన్ సృష్టించలేకపోయింది. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం షారుఖ్ రేంజ్‌లో రాబట్టలేకపోయింది.

ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అంతకు ముందు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు 89.5 కోట్లు రాబట్టగా.. పఠాన్ సినిమా 57 కోట్లు రాబట్టింది. కానీ ఈ రెండు సినిమాల కంటే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టింది డంకీ. ఇక రిలీజ్‌ 1స్ట్‌ డే.. డంకీ సినిమా మొత్తం 29.94% ఆక్యుపెన్సీ అందుకుంది. NCR ప్రాంతంలో సుమారు 31% ఆక్యుపెన్సీతో 1412 షోలు ఉన్నాయి. ముంబైలో 1081 షోలు ఉన్నాయి. ఇది దాదాపు 29.75% ఆక్యుపెన్సీ ఉన్నట్లు. కానీ డంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఇప్పటి వరకు మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించలేదు.

Updated On 23 Dec 2023 6:38 AM GMT
Ehatv

Ehatv

Next Story