ప్రిన్స్‌ మహేశ్‌బాబు(mahesh babu) హీరోగా, త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరుకారం (Guntur Karan)సినిమాకు దిష్టి తగిలినట్టుగా ఉంది. అనేక అవరోధాల మధ్య షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి (Sankranthi) కానుకగా విడుదల చేయాలని మేకర్స్‌ అనుకుంటున్నారు.

ప్రిన్స్‌ మహేశ్‌బాబు(mahesh babu) హీరోగా, త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరుకారం (Guntur Karan)సినిమాకు దిష్టి తగిలినట్టుగా ఉంది. అనేక అవరోధాల మధ్య షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి (Sankranthi) కానుకగా విడుదల చేయాలని మేకర్స్‌ అనుకుంటున్నారు. లీకులు (leaks)కూడా ఆ సినిమాను ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దమ్‌ మసాలా (dum masala) పాట లీక్‌ కావడంతో మేకర్స్‌ ఆందోళన పడుతున్నారు. గుంటూరు కారం సినిమాలో దమ్ మసాలా సాంగ్ కు సంబంధించి వీడియో క్లిప్స్ కొన్ని (video clips) సోషల్ మీడియాలో (social media) వైరల్ చక్కర్లు కొడుతున్నాయి. హీరోను ఎలివేట్‌ చేస్తూ ఈ పాటను రూపొందించినట్టుగా లీకైన వీడియోలను బట్టి తెలుస్తోంది. మహేశ్‌బాబు వేసిన మాస్‌ స్టెప్పులు కూడా బాగున్నాయి. దమ్ మసాలా సాంగ్ లో మహేష్ వేసిన 2 స్టెప్స్ కు సంబంధించిన ఆన్-లొకేషన్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. లీక్‌ అయిన వెంటనే మేకర్స్‌ అలెర్టయ్యారు. చాలా క్లిప్స్‌ను సోషల్‌ మీడియాలోంచి తొలగించారు. అటు మహేశ్‌బాబు అభిమానులు కూడా క్లిప్స్‌ను షేర్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఈ క్లిప్స్‌ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా కల్కి, పుష్ప-2, సలార్‌, గేమ్‌ ఛేంజర్‌ సినిమాలు కూడా లీకుల బారిన పడ్డాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. కాబట్టి వీటిని ఆపడం కష్టం.

Updated On 21 Nov 2023 11:04 PM GMT
Ehatv

Ehatv

Next Story