డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌(Nag ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కల్కి 2898 ఎ.డి.(Kalki 2898 AD) ఇందులో అగ్రతారలు నటిస్తున్నారు. బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌(Amitabh bachchan), లోకనాయకుడు కమలహాసన్‌(Kamal hassan), బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే(Deepika padukone), దిశా పటానీ(Disha patani) ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌(Nag ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కల్కి 2898 ఎ.డి.(Kalki 2898 AD) ఇందులో అగ్రతారలు నటిస్తున్నారు. బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌(Amitabh bachchan), లోకనాయకుడు కమలహాసన్‌(Kamal hassan), బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే(Deepika padukone), దిశా పటానీ(Disha patani) ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో యంగ్‌ హీరో నటించనున్నట్టు న్యూస్‌ అందింది. కింగ్‌ ఆఫ్‌ కోథా(King of kotha) సినిమాతో అభిమానులకు అలరించడానికి రెడీగా ఉన్న దుల్కర్‌ సల్మాన్‌(Dulqer salmaan) ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మహానటితో తెలుగువారికి పరిచయమైన దుల్కర్‌ సల్మాన్‌ సీతారామం సినిమాతో ప్రేక్షకులకు అత్మీయుడయ్యాడు.

సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమా గురించి దుల్కర్‌ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఈ విషయం గురించి నేనిప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ భవిష్యత్తు నేపథ్యంలో జరిగే కథ ఇది. సెట్స్‌ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటివి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాత్రమే డిజైన్‌ చేయగలడు’ అని మాత్రమే దుల్కర్‌ చెప్పారు కానీ ఇందులో భాగం పంచుకుంటున్నది లేనిది చెప్పలేదు. తాను ఆ సినిమా సెట్స్‌ని సందర్శించానని, గతంలో తీసిన ఎవడే సుబ్రమణ్యం చిత్రం కంటే కొత్తగా నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను చిత్రీకరించనున్నారని అన్నారు దుల్కర్‌. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోన్న ‘కల్కి’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

Updated On 19 Aug 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story