ఈ ఏడాది సినిమాల(Movies) పరంగా బాలకృష్ణకు(Balakrishna) బాగా కలిసివచ్చింది. వరుసగా వీరసింహారెడ్డి(Veerasimha Reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించాయి. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో తన తర్వాతి చిత్రంపై దృష్టి పెట్టాడు బాలయ్య. బాలయ్య నటిస్తున్న 109వ(NBK109) సినిమాకు బాబీ(Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో(Walther Veeraiah) సూపర్‌హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాను కూడా సూపర్‌డూపర్ హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు

Dulqer Salman
ఈ ఏడాది సినిమాల(Movies) పరంగా బాలకృష్ణకు(Balakrishna) బాగా కలిసివచ్చింది. వరుసగా వీరసింహారెడ్డి(Veerasimha Reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించాయి. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో తన తర్వాతి చిత్రంపై దృష్టి పెట్టాడు బాలయ్య. బాలయ్య నటిస్తున్న 109వ(NBK109) సినిమాకు బాబీ(Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో(Walther Veeraiah) సూపర్‌హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాను కూడా సూపర్‌డూపర్ హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulqer Salman) ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట! అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందని అభిమానులు అంటున్నారు. అలాగే బాలకృష్ణను ఎలా చూపించబోతున్నాడోనని ఫ్యాన్స్‌తో పాటు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. NBK 109 సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గొడ్డలికు ఓ కళ్లజోడును జోడించి.. అందులో ఎగిరిపడుతున్న విలన్లు చూపించారు మేకర్స్. ఇక అదే గొడ్డలికి ఓ లాకెట్‌ను కూడా ఉంది. అంతేకాకుండా బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ వీర లెవల్ ఎలివేషన్‌తో ఆ పోస్టర్‌కు బాబీ క్యాప్షన్ జోడించారు.
