మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటి(Mammuti) కుమారుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు తండ్రి పేరును ఎక్కడా వాడుకోలేదు. సొంతంగా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. మంచి సినిమాలను ఎంపిక చేసుకుని తక్కువ కాలంలోనే అగ్రహీరోగా ఎదిగారు. ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు దుల్కర్.
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటి(Mammootty ) కుమారుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు తండ్రి పేరును ఎక్కడా వాడుకోలేదు. సొంతంగా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. మంచి సినిమాలను ఎంపిక చేసుకుని తక్కువ కాలంలోనే అగ్రహీరోగా ఎదిగారు. ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు దుల్కర్. మహానటి సినిమా(Mahanati) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్ లాస్టియర్ వచ్చిన సీతారామం(Sithramam) సినిమాతో మరింత దగ్గరయ్యారు. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో తెలుగులోనూ ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ తన ఫ్యామిలీ గురించి, సినిమాల ఎంపిక గురించి తెలిపారు. సినిమాల సెలెక్షన్‌లో తన తండ్రి మమ్ముటి అభిప్రాయాలు ఎలా ఉంటాయో చెప్పుకొచ్చారు. భార్య అమల్ సూఫియాకు(Amal Sufia) తన స్టార్‌డమ్ గురించి ఏ మాత్రం అవగాహన లేదని, ఓ సాధారణ ఇల్లాలిగానే ఆమె ప్రవర్తిస్తుందని దుల్కర్ అన్నారు.
'సూఫియా దృష్టిలో నటన కూడా ఓ ఉద్యోగం వంటిదే. ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటే చాలని ఆమె అనుకుంటుంది. అంతకు మించి నా నుంచి ఏమీ ఆశించదు' అని దుల్కర్ అన్నారు. తండ్రి మమ్ముట్టి నటుడిగా తన విజయాల పట్ల సంతోషంగా ఉన్నారని, అయితే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఆయన కోరిక అని పేర్కొన్నారు. 'నేను ఏడాదికి ఎనిమిది తొమ్మిది సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు ఏడాదికి రెండు సినిమాలు కూడా చేయడం లేదు. ఇలా అయితే ఇంకోసారి ఇంటికి రానివ్వను' అని నాన్న తనును హెచ్చరించినట్టు దుల్కర్ తెలిపారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోటా’(King Of Kota) అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.