దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) మలయాళ హీరో అయినప్పటికీ మనకు కూడా చాలా దగ్గర. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ ఆ తర్వాత మహానటి(Mahanati)తో బాగా దగ్గరయ్యాడు. సీతారామం(Sita Ramam) సినిమాతో తెలుగులో తనకంటూ ఓ స్పేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) మలయాళ హీరో అయినప్పటికీ మనకు కూడా చాలా దగ్గర. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ ఆ తర్వాత మహానటి(Mahanati)తో బాగా దగ్గరయ్యాడు. సీతారామం(Sita Ramam) సినిమాతో తెలుగులో తనకంటూ ఓ స్పేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు హీరోలకు సరిసమానంగా దుల్కర్ సినిమాలకు ఇక్కడ క్రేజ్ ఉంది. మమ్ముట్టి కుమారుడైనప్పటికీ సొంతంగా ఇమేజ్‌ను బిల్డప్ చేసుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ కూడా నేరుగా తెలుగు దర్శకులతో చేతులు కలుపుతూ మార్కెట్‌ను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు. ఈ మధ్యనే ఓ స్ర్టయిట్ తెలుగు సినిమాకు ఓకే చెప్పారు దుల్కర్. వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సితార బ్యానర్(Sitara Banner)లో తెరకెక్కుతోంది. అక్టోబర్‌లో షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా మరో తెలుగు సినిమాకు కమిట్ అయ్యాడు దుల్కర్. నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) స్పిరిట్ మీడియా బ్యానర్‌ను స్థాపించి యంగ్ టాలెంట్‌కు ప్రాధాన్యతనిస్తున్నాడు. ఈ క్రమంలోనే సురేశ్ ప్రొడక్షన్ సంస్థలో చాలా కాలంగా పని చేస్తున్న ఓ యంగ్ టెక్నిషియన్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. ఇందులో హీరో దుల్కర్ సల్మాన్. చాలా కాలంగా రానా, దుల్కర్‌లు మంచి ఫ్రెండ్స్. అందుకే మరో మాట మాట్లాడకుండా దుల్కర్ సినిమాకు అంగీకారం తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయట. ఈ సినిమాలో సముద్రఖని ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. డి.రామానాయుడు జయంతి సందర్భంగా జూన్ 6న ఈ చిత్ర విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మలయాళ చిత్రం కింగ్ ఆఫ్ కోతలో నటిస్తున్నారు. అభిలాష్ ఎన్.చంద్రన్ దీనికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 24న ఈ సినిమా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రానా సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.