సార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి(Venky Atluri) నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారంటే.. రకరాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈక్రమంలో ఆయన సినిమాపై క్లారిటీ రావడంతో పాటు.. ఆడియన్స్ కు సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు.

సార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి(Venky Atluri) నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారంటే.. రకరాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈక్రమంలో ఆయన సినిమాపై క్లారిటీ రావడంతో పాటు.. ఆడియన్స్ కు సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు.

మన తెలుగు దర్శకులకు, తెలుగు హీరోలకు అన్నిభాషల్లో క్రేజ్ పెరుగుతుంది. ఇతర భాషల్లో మన హీరలు హవా చూపిస్తుంటే.. మన దర్శకులతో సినిమాల కోసం ఇతర భషల్లో స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలో వచ్చిన సినిమాల్లో సార్(sir) మూవీతో పాటు.. సీతారామం(Sitha Ramam) కూడా ఇలాంటి కాంబోలో వచ్చిందే. ఈరెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తమిళ హీరో ధనుష్ తో.. వెంకీ అట్లూరి సార్ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో..హనూరాఘవపూడి సీతారామం తీసి బ్లాక్ బస్టర్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే థనుష్ డైరెక్టర్ తో.. సీతారామం హీరో క్రేజీ కాంబో సినిమా సెట్ అయ్యింది.

మహానటి(Mahanati) సినిమాతో టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్(Dulqer salmaan). టాలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన యంగ్ స్టార్.. సీతారామం సినిమాతో అది కూడా సాధించాడు. ప్రస్తుతం దుల్కర్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. సెకండ్ టైర్ హీరోగా ఇమేజ్ కూడా ఉంది. దాంతో దుల్కర్ తో తెలుగుసినిమా చేయడానికి పోటీ పడుతున్నారు మేకర్స్..

ప్రస్తుతం దుల్కర్‌ కింగ్ ఆఫ్‌ కొత అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా దుల్కర్‌ మరో తెలుగు సినిమాకు కమిట్‌ అయ్యాడు. అది కూడా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరితో. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ తో సార్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఈక్రమంలో ఆయన నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్న క్రమంలో దుల్కర్‌ తో తన తదుపరి సినిమా అనౌన్స్ చేశాడు యంగ్ డైరెక్టర్ .

బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో జోరుమీదున్న.. తెలుగు నిర్మాణ సంస్థ సితార(sithara) ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. తాజాగా మేకర్స్‌ఉ ఈ కాంబోపై అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు వెంకీ అట్లూరి, దుల్కర్‌ సల్మాన్‌, నాగవంశీ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ 2023, అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Updated On 15 May 2023 12:13 AM GMT
Ehatv

Ehatv

Next Story