డిసెంబర్ 5వ తేదీ కోసం అల్లు అర్జున్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజు వారికి పండుగ రోజు.
డిసెంబర్ 5వ తేదీ కోసం అల్లు అర్జున్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజు వారికి పండుగ రోజు. ఎందుకంటే పుష్ప 2: ది రూల్ సినిమా ఆ రోజే విడుదల అవుతున్నది కాబట్టి. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అంత ఆసక్తి ఎందుకంటే మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్(Allu Arjun)ను వెండితెరపై చూడాల్సి రావడమే! ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ మొదలు పెట్టారు. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కే ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) నగరంలో నెల రోజుల పాటు పోలీసుల ఆంక్షలు ఉన్నాయి. అయిదుగురుకు మించి గుమిగూడకూడదు. ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand ) ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ సాయంత్రం ఆరు గంటల దాకా హైదరాబాద్‌లో ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం విధించారు. దీన్నిబట్టి చూస్తే పుష్ప2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం కష్టమే! పోలీసులు ఆంక్షలు నవంబర్ 28వ తేదీకి ముగుస్తాయి. వెంటనే భారీ ఈవెంట్‌ను జరుపుకోవడం కష్టమే! జరుపుకుంటామనే నమ్మకం ఉన్నా, పోలీసులు అనుమతి ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అక్కడ కూడా అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan)- అల్లు అర్జున్ (Allu Arjun) మధ్య అంతరం పెరిగిందన్నది వాస్తవం! మెగా కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు కూడా ! పైగా ఆ మధ్యన బెంగళూరులో పుష్ప సినిమాను తక్కువగా చేసి మాట్లాడారు పవన్. సో, ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం కష్టమేననిపిస్తోంది. దేవర (Devara)సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇబ్బందులు వచ్చాయన్న సంగతి తెలిసింది.