Donald Trump Biopic : డొనాల్డ్ ట్రంప్ బయోపిక్.. సినిమా ఎలా ఉందంటే...?
ఈ మధ్య కాలంలో మన దగ్గర బయోపిక్‌లు(Biopics) ఏ ఉద్దేశంతో తీస్తున్నారో, కల్పిత కథనాలతో ప్రజల మనసుల్లో ఎలాంటి విషబీజాలు నాటుతున్నారో చూస్తున్నాం! ఇలాంటి ట్రెండ్ హాలీవుడ్‌లోనూ ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బయోపిక్(Biopic) ఒకటి రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రీమియర్ షో ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) ప్రదర్శించారు.
ఈ మధ్య కాలంలో మన దగ్గర బయోపిక్‌లు(Biopic) ఏ ఉద్దేశంతో తీస్తున్నారో, కల్పిత కథనాలతో ప్రజల మనసుల్లో ఎలాంటి విషబీజాలు నాటుతున్నారో చూస్తున్నాం! ఇలాంటి ట్రెండ్ హాలీవుడ్‌లోనూ ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బయోపిక్(Biopic) ఒకటి రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రీమియర్ షో ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) ప్రదర్శించారు. సినిమా పేరు ది అప్రెంటిస్..(The Apprentice) సినిమా చూసిన తర్వాత ట్రంప్ బృందం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కోర్టులో తేల్చుకుంటామని చెప్పింది. ఏడు, ఎనిమిది దశకాలలో అమెరికా రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో ట్రంప్ ఎలా ఎదిగారో సినిమాలో చూపించారు. అయితే ఈ సినిమాలో అభూత కల్పనలు చాలా ఉన్నాయని, ట్రంప్ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ట్రంప్ ప్రచారబృందం అంటోంది. ఇదో బక్వాస్ సినిమా అని, హాలీవుడ్ ప్రముఖుల కుట్ర ఉందని చెబుతోంది.
ఇందులో సన్నివేశాలు కల్పితాలు అనే డిస్‌క్లెయిమర్‌తో సినిమా ప్రారంభమైనప్పటికీ ట్రంప్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను యథాతథంగా చూపించారు. పోర్న్‌స్టార్‌కు అక్రమ నిధుల బదిలీ కేసులో ట్రంప్ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే! మరోవైపు నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ సినిమా రావడం గమనార్హం. పదేళ్ల పాటు ట్రంప్ ఓ టీవీ సీరిస్‌ను నడిపారు. ఆ సిరీస్ టైటిల్‌ను తలపించేలా సినిమాకు అప్రెంటిస్ అని పేరు పెట్టారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ట్రంప్ నిలదొక్కుకుంటున్న తొలినాళ్ల జీవితాన్ని ఇందులో చక్కగా చూపించారు. ట్రంప్ పాత్రను సెబాస్టియన్ స్టాన్ అనే నటుడు పోషించాడు. ట్రంప్ సలహాదారు, ప్రముఖ న్యాయవాది రాయ్ కోన్ పాత్రను జెరెమీ స్ట్రాంగ్ పోషించారు. అలాగని ఈ సినిమాలో ట్రంప్ అన్ని షేడ్స్‌ను చూపించారు. ప్రథమార్థంలో అత్యాచారం, లైంగిక సమస్యలు, బట్టతల, ద్రోహం వంటి సన్నివేశాలు ఉన్నాయి.
ఇది చూసిన తర్వాత ట్రంప్‌పై సానుభూతి కలగకుండా ఉండదు.రాయ్ కోన్ పరిచయం తర్వాత ట్రంప్ వ్యక్తిత్వం ఎలా మారిందో చూపించారు. తన మొదటి భార్య ఇవానాను ట్రంప్ అత్యాచారం చేసినట్లుగా చూపడం మాత్రం వివాదానికి దారి తీసింది. విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో తనపై ట్రంప్ అత్యాచారానికి పాల్పడ్డట్లు ఇవానా ఆరోపించడం, తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడం తెలిసిన విషయాలే! 2022లో ఆమె మరణించారు. ఇవానా పాత్రన మరియా బకలోవా అనే నటి పోషించారు. సినిమా చూడబుల్‌గానే ఉన్నా ట్రంప్ ప్రచార బృందం డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ మాత్రం విరుచుకుపడుతున్నాడు. అబద్ధాలను సంచలనం చేయడానికి తీసిన ఒక చెత్త సినిమాగా ఆయన అభివర్ణించారు. సినిమా మొత్తం అసత్యాలతో కూడుకున్నదని చెప్పారు. ట్రంప్ కచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తారనే అక్కసుతోనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. అయితే సినిమా దర్శకుడు అబ్బాసీ మాత్రం సినిమా చూసి మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. సినిమా చూడకుండా కోర్టులో సవాల్ చేయడం సరైంది కాదన్నారు. సినిమా చూసిన తర్వాత ట్రంపే ఆశ్చర్యపోతారే తప్ప ఆగ్రహించరని అబ్బాసీ చెప్పుకొచ్చారు.