జాతీయ చలన పురస్కారాలలో ( National Film Awards) ఉత్తమ చిత్రంగా(Best Movie) ఆట్టం(Aattam)నిలిచింది.

జాతీయ చలన పురస్కారాలలో ( National Film Awards) ఉత్తమ చిత్రంగా(Best Movie) ఆట్టం(Aattam)నిలిచింది. మలయాళ సినిమా(Malayalam movie)కు అవార్డులు రావడం సహజమే! అసలు ఈ సినిమాలో ఏముందనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. సినిమా కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. ఏ ఓటీటీలో ఉందోనని వెతికారు. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌(Amazon Prime)లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కేవలం మలయాళ భాషలోనే ఉంది. తెలుగు సబ్‌టైటిల్స్‌ ఉన్నాయి. కేరళలోని ఓ నాటక బృందం టైమ్‌ దొరికినప్పుడు నాటకాలు ప్రదర్శిస్తుంటుంది. ఈ బృందంలో ఉన్న 12 మంది ఉద్యోగాలు, పనులు చేసుకుంటూనే నాటకాలు వేస్తుంటారు. వీరికి తోడుగా అంజలి(Anjali)అనే అమ్మాయి ఉంటుంది. ఓసారి వీరి ప్రదర్శనను ఓ విదేశీ జంట బాగా ఇష్టపడుతుంది. తమ రిసార్ట్‌(Resart)లో వీరికి ఆతిథ్యమిస్తుంది. వారంతా రాత్రి రిసార్ట్‌లో బాగా ఎంజాయ్‌ చేస్తారు. తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోతారు. గదిలో కిటికీ పక్కన పడుకున్న అంజలిలో ఆ బృందంలో ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఎవరనేది తెలియదు. ఆ వ్యక్తిని ఆమె ఎలా బయటపెట్టిందన్నదేఆట్టం చిత్ర కథ. కథ సాధారణమైనదే కానీ ఆ కథను దర్శకుడు ప్రెజంట్‌ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. మనుషులకు రెండు ముఖాలు ఉంటాయి. ఓ ముఖం మంచిగా కనిపిస్తుంటుంది. కానీ లోపల మరో మనిషి ఉంటాడు. తాను మంచివాడనని చెప్పుకోవడానికి ఎదుటి వ్యక్తిని చెడ్డవాడుగా చిత్రీకరిస్తుంటాడు. ఇలాంటి వారు మనకు ప్రతి రోజు తారసపడుతుంటారు. ఈ సినిమాలో మనిషి నైజాన్ని చక్కగా చిత్రీకరించారు. ఓ మనిషి మనకు నచ్చకపోతే అతడు చేసిన పనులేవీ మనకు నచ్చవు. అదే మనకు నచ్చిన మనిషి చెడు చేసినా మనకు మంచిలాగే గోచరిస్తుంటుంది. మెత్తంగా ఈ సినిమాలో మనుషుల ప్రవర్తన, బాధితురాలి మానసిక వేదన చక్కగా చూపించారు. ఉత్తమ చిత్రానికి కావాల్సిన అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి.

ehatv

ehatv

Next Story