విజయ్ దేవరకొండకు(Vijay devarkonda) స్టార్‌డమ్‌ను అందించిన సినిమా గీతగోవిందం(Geetha Govindham). రష్మిక కూడా ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు పరశురామ్(Parushuram) కూడా నిర్మాతల దృష్టి తన మీద పడేలా చేసుకున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నది.

Divyansha Kaushik
విజయ్ దేవరకొండకు(Vijay devarkonda) స్టార్‌డమ్‌ను అందించిన సినిమా గీతగోవిందం(Geetha Govindham). రష్మిక కూడా ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు పరశురామ్(Parushuram) కూడా నిర్మాతల దృష్టి తన మీద పడేలా చేసుకున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నది. దిల్‌రాజు(Dil Raju), శిరీష్(Sirish) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండకు జంటగా సీతారామం ఫేమ్ మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తున్నారు. లేటెస్ట్‌గా అందిన సమాచారమేమిటంటే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నారు. మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik) ఈ సినిమాలో కీలక పాత్ర ధరించబోతున్నారు. ఈ విషయాన్ని దివ్యాంశ కౌశిక్ సోషల్ మీడియాలో తెలిపారు. ఇది విజయ్ దేవరకొండకు 13 వ సినిమా కావడం విశేషం. గీతగోవిందం తరహాలోనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండబోతున్నది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ(Ramouji Film City) జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాకు ఫ్యామిలీస్టార్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
